ఫైజర్ వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ ! గుండెపొరల్లో వాపు లక్షణాలు !!

0
140

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఆయుధం వ్యాక్సినేషన్. ఇటువంటి తరుణంలో ప్రపంచవ్యాప్తంగా అందరూ వ్యాక్సిన్స్ వేయించుకున్న విషయం తెలిసిందే. అయితే తాజగా ఫైజ‌ర్ కంపెనీ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో మైయోకార్డిటిస్ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్న‌ట్లు ఇజ్రాయిల్ పేర్కొంది. దీనివల్ల గుండె పొర‌ల్లో స్వ‌ల్ప స్థాయిలో వాపు వస్తుందని. ఈ విషయాన్ని గుర్తించినట్టు ఇజ్రాయిల్ ఆరోగ్య‌శాఖ మంత్రి తెలిపారు.

ఇందులో ముఖ్యంగా మగవారిలో ఈ ల‌క్ష‌ణాలు ఎక్కువ‌గా కనిపిస్తున్నాయని ఆయ‌న ఈ సందర్బంగా పేర్కొన్నారు. తమ దేశంలో గ‌త ఏడాది డిసెంబ‌ర్ నాటి నుంచి ఈ ఏడాది మే చివరి వ‌ర‌కు మొత్తం 275 మైయోకార్డిటిస్ కేసులు న‌మోదయ్యాయని తెలిపింది. అయితే ఇజ్రాయిల్ లో ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 50 ల‌క్ష‌ల మందికి వ్యాక్సిన్ లు వేశారు. ఈ వ్యాక్సిన్లు తీసుకున్న వారిపై పరిశోధన చేసి ఆ సమాచారాన్ని ఇజ్రాయిల్ ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసింది. దీనిపై స్పందించిన ఫైజ‌ర్ సంస్థ మాత్రం ఇటువంటి సమస్యలు ఉన్న కేసులు చాలా తక్కువగా ఉన్నాయని, ఇజ్రాయిల్ గుర్తించిన మైయోకార్డిటిస్ లక్షణాలను తాము కూడా స్టడీ చేస్తున్నట్టు పేర్కొంది ఫైజర్ సంస్థ. అయితే ఫైజర్ వ్యాక్సిన్ కు ఈ లక్షణాలకు సంబంధం ఉందని అనలేమని. వ్యాక్సిన్ సైడ్ ఎఫ్ఫెక్ట్స్ గురించి సేఫ్టీ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుందని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here