ఈరోజు ఉదయం నుంచి హీరోయిన్ ప్రణీత పెళ్లి ఫోటోలు వైరల్ అయ్యాయి. ప్రాముఖ్య బిజినెస్ మ్యాన్ నితిన్ రాజును ప్రణీత సెక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు అంటూ వార్తలు వచ్చాయి. హీరోయిన్ ప్రణీత వివాహాం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రణీత ఇలా ఎవరికీ చెప్పకుండా సైలెంట్ గా పెళ్లి చేసుకోవడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇక ఆమె అభిమానుల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే తాజగా తన పెళ్లి గురించి అభిమానులందరికీ ఓ ప్రకటన చేశారు.
‘మే 30వ తేదీన మేమిద్దరం పెళ్లి చేసుకున్నామనే విషయాన్ని మీ అందరికి చెప్పడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.. అయితే ముందుగా మీకు అందరికీ ఈ పెళ్లి గురించి ఎటువంటి సమాచారాన్ని ఇవ్వలేకపోయాము. అందుకు నన్ను క్షమించండి.. ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితుల్లో మేం కూడా పెళ్లి తేదిని చివరి వరకు నిర్ణయించలేదు. అందువల్ల ఎదో ఒక డేట్ చెప్పి మీ అందరినీ కన్ఫ్యూజ్ చేయడం నాకిష్టం లేదు.. మీరందరూ దయచేసి నా క్షమాపణలను స్వీకరించండి.. నా లైఫ్ లో మీరు అందరూ చాలా ప్రత్యేకమైన వాళ్ళు మీతో ఈ విషయాన్ని పంచుకోవడం నాకెప్పుడూ ప్రత్యేకమే.. త్వరలో పరిస్థితులన్నీ చక్కబడ్డాక మనందరం కలిసి సెలెబ్రేట్ చేసుకుందాం.. ప్రేమతో ప్రణీత అండ్ నితిన్’ అని చెప్పుకొచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…