Gajuwaka Conductor: గాజువాక కండక్టర్ ఝాన్సీ ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. టాలెంట్ ఉన్న వాళ్ళని ప్రేక్షకులకు పరిచయం చేయడానికి మల్లెమాలవారు ముందు వరుసలో ఉంటారు.ఈ క్రమంలోనే డాన్స్ లో ఎంతో టాలెంట్ కలిగి ఉన్నటువంటి గాజువాక బస్సు కండక్టర్ ఝాన్సీ గత 11 సంవత్సరాల నుంచి డాన్స్ చేస్తూ ఎంతో కష్టపడుతోంది. అయితే ఆమె కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం దక్కిందని తెలుస్తుంది.
సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత తనలో ఉన్నటువంటి టాలెంటును బయట పెడుతూ డాన్స్ వీడియోలు చేశారు. ఇలా ఈమె డాన్స్ చూసినటువంటి మల్లెమాలవారు ఏకంగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో పల్సర్ బండి అనే పాటకు డాన్స్ చేస్తూ అందరినీ ఒక్కసారిగా తన వైపుకు తిప్పుకున్నారు.
ఈ విధంగా ఒక సాధారణ బస్ కండక్టర్ డాన్స్ పై ఉన్న మక్కువతో ఇలా సెలబ్రిటీగా మారిపోవడంతో చాలామంది ఈమె వ్యక్తిగత విషయాల గురించి ఆరా తీయడమే కాకుండా ఈమెకు సంబంధించిన ఓల్డ్ వీడియోలను కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఇక ఈమె ఒకవైపు బస్ కండక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు పలు కార్యక్రమాలలో డాన్స్ చేస్తూ సందడి చేశారు.
ఇలా ఝాన్సీ ఓ కార్యక్రమంలో భాగంగా సీతయ్య సినిమాలోని ఒక్క మగాడు అనే మాస్ పాటకు మాస్ పర్ఫామెన్స్ చేసి అందరిని సందడి చేశారు. అయితే ఈ పాటకు సంబంధించిన ఓల్డ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోలో ఈమె పెర్ఫార్మెన్స్ చూసిన నేటిజన్స్ ఫిదా అవుతూ తనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…