Featured

Pavan Kalyan : పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న బ్యాడ్ సెంటిమెంట్… ఆయనతో చేసాక వాళ్ళందరూ అడ్రెస్ లేకుండా పోయారట..!

Pavan Kalyan : పవన్ కళ్యాణ్ తో సినిమా అంటేనే ఎగిరి గంతేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక్కసారి పవర్ స్టార్ తో కలిసి నటిస్తే చాలు, ఒక చిన్న పాత్రయినా పర్వాలేదు అనుకునే సెలబ్రిటీలు ఎంతోమంది. ఇక అలాంటిది ఏకంగా హీరోయిన్ గా అవకాశం వస్తే ఇంక అంతకంటే గోల్డెన్ ఛాన్స్ ఏముంటుంది. అంత పెద్ద హీరోతో చేసాక ఇక అవకాశాలు క్యూ కడతాయి, కెరీర్ కి డోకా లేదు అనుకుంటారు. కానీ పాపం ఈ ముద్దుగుమ్మలు మాత్రం పవన్ తో సినిమా చేసి ఆ తరువాత అడ్రెస్ లేకుండా పోయారు. ఇది ఎప్పటినుండో పవన్ చుట్టూ ఉన్న సెంటిమెంట్. ఆయనతో నటించాక కొంతమంది హీరోయిన్లు కనుమరుగయిపోవడం వల్ల ఇలాంటి సెంటిమెంట్ పుట్టుకోచ్చింది.

ఆ ఎనిమిది మంది కెరీర్ పోయింది…

సినిమాల్లో బోలెడు సెంటిమెంట్లు మామూలే ఆ హీరోయిన్ లక్కీ అని ఈ హీరోయిన్ ఐరన్ లెగ్ అంటూ మాటలు మామూలే. ఇక హీరోలకు అచ్చోచ్చిన వారిని నామమాత్రంగా ఒక సీన్ కోసం పెట్టుకోవడం లేకపోతే అచ్చోచిన తేదీలోనే సినిమా విడుదల చేయడం చూస్తుంటాము. అయితే పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ ఎనిమిది మంది ముద్దుగుమ్మలకు చిత్రంగా మళ్ళీ కెరీర్ లో ముందడుగు పడలేదు, హిట్స్ లేవు. ఈ జాబితాలో మొదట చెప్పుకోవాల్సిన హీరోయిన్ నాగేశ్వరావు గారి మనవరాలు సుప్రియ. పవన్ మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి’ తో పరిచయమైన సుప్రియ యార్లగడ్డ ఆ సినిమా తరవాత ఇక ప్రొడక్షన్ వర్క్ వైపు వెళ్ళింది సినిమాల్లో నటించలేదు. ఇక నెక్స్ట్ కీర్తి రెడ్డి. సుమంత్ మాజీ భార్య కీర్తి రెడ్డి పవన్ తో ‘తొలిప్రేమ’ సినిమాలో నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అందులో కీర్తి పాత్ర ఇప్ప్పటికీ అందరికీ ఇష్టం కానీ ఈ సినిమా తరువాత కీర్తి సినిమాల్లో కనిపించలేదు మళ్ళీ చాలా కాలానికి మహేష్ బాబు సినిమా అర్జున్ లో అక్క పాత్రలో అలరించింది.

ఇక ఈ జాబితాలో పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా ఉన్నారు. ఆమె బద్రి, జానీ సినిమాల్లో చేసి ఇక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. ‘సుస్వాగతం’ సినిమాలో నటించిన దేవయని కూడా కొన్ని సినిమాల్లో కనిపించినా తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక నెక్స్ట్ పవన్ ‘తమ్ముడు’ సినిమాలో హీరోయిన్ ప్రీతి జింగనియా ఆ సినిమాలో క్యూట్ గా అమాయకంగా కనిపించి కుర్ర కారు మనసు దోచుకున్న ప్రీతీ జింగనియా ఆ తరువాత బాలకృష్ణ నరసింహానాయుడు, మోహన్ బాబు అధిపతి లో నటించింది. ఇక మళ్ళీ తెలుగులో పెద్దగా కనిపించలేదు. ఇక పవన్ సినిమా ‘బంగారం’ లో నటించిన మీరా చోప్రా ఈమె కూడా ఈ సినిమా తరువాత కనిపించలేదు. ఇక ‘బాలు’ సినిమాలో నటించిన నేహా ఓబెరాయ్, ఇక ‘పంజా’ లో నటించిన అంజలి లవానియా పరిస్థితి అంతే ఒక్క సినిమాలో తల్లుక్కున మెరిసి కనిపించకుండాపోయారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago