Movie News

Game Changer: అమెరికాలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చరణ్ తప్పు చేస్తున్నారా?

Game Changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ త్వరలోనే గేమ్ ఛేంజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్లను కూడా మొదలుపెట్టారు.

ఇటీవల ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం లక్నోలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే పుష్ప2 సినిమా ట్రైలర్ పాట్నాలో జరగడంతో ఊహించని విధంగా ఈ కార్యక్రమానికి అభిమానులు తరలి వచ్చారు. ఇది చూసిన గేమ్ ఛేంజర్ మేకర్స్ ఏకంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను అమెరికాలో నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రామ్ చరణ్ కు గ్లోబల్ స్టార్ అని ట్యాగ్ ఉంది అయితే ఈ ట్యాగ్ ఉపయోగించుకొని అమెరికాలో ఈ సినిమా వేడుకను నిర్వహించడం ఎంతవరకు కరెక్ట్ అనే ఆలోచనలో అభిమానులు ఉన్నారు. ఇలా ఇతర దేశాలలో ఈ సినిమా వేడుకను నిర్వహిస్తే పెద్దగా బజ్ రాకపోవచ్చు అని అభిమానులు భావిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు ఇప్పటివరకు ప్రేక్షకులలో ఏమాత్రం హైప్ లేదని చెప్పాలి.

Game Changer: అమెరికాలో..

సంక్రాంతికి ఈ సినిమా రాబోతున్న నేపథ్యంలో కలెక్షన్ల వరకు పరవాలేదు కానీ రికార్డులు సాధించాలి అంటే సినిమాపై మంచి హైప్ ఉండాలి. ఇలాంటి తరుణంలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా ప్రమోషన్లను నిర్వహించకుండా విదేశాలలో ఈ సినిమా వేడుకలను నిర్వహిస్తే ఖచ్చితంగా సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.యూఎస్‌ఏలో ఓ తెలుగు మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగడం ఇదే మొదటిసారి. డిసెంబర్ 21న గార్లాండ్‌లోని కుర్తీస్ కుల్‌వెల్ సెంటర్‌లో ‘గేమ్ ఛేంజర్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అయితే ఈ నిర్ణయం ఎంతవరకూ కరెక్ట్ అనేది చాలా మంది సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago