Nagachaitanya: జోష్ అనే సినిమా ద్వారా హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు అక్కినేని వారసుడు నాగచైతన్య. ఈ సినిమా ద్వారా హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన మొదటి సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న రెండో చిత్రం ఏం మాయ చేసావే సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో వరుస సినిమాలలో అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు.
ఇక ఈయన సినీ కెరియర్లో హిట్ సినిమాలతో పాటు ప్లాప్ సినిమాలు కూడా ఉన్నాయని చెప్పాలి. ఇకపోతే త్వరలోనే మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం తండేల్ సినిమా ద్వారా నాగచైతన్య హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. అల్లు అరవింద్ నిర్మాణంలో డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో నిజ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇకపోతే ఈ సినిమా తర్వాత నాగచైతన్య మరో పాన్ ఇండియా సినిమాకి కమిట్ అయ్యారు. నేడు ఈయన పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమాకు సంబంధించి అప్డేట్ విడుదల చేశారు. నాగచైతన్య తన 24వ చిత్రాన్ని విరూపాక్ష సినిమా డైరెక్టర్ కార్తీ దండు దర్శకత్వంలో సుకుమార్ నిర్మాణంలో మరో సోసియో ఫాంటసీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
తాజాగా ఈ సినిమాకి సంబంధించి మేకర్స్ అధికారక పోస్టర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం ఈయన నటిస్తున్న తండేల్ సినిమాపై ఇప్పటికి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అయితే చైతన్య కెరియర్ పూర్తిగా టర్న్ అవుతుందని చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న తరుణంలో సినిమాపై మరిన్ని అంచనాలు ఉన్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…