Garikapati Narasimha Rao: గత కొద్దిరోజులుగా గరికపాటి నరసింహారావు మెగాస్టార్ చిరంజీవి మధ్య జరిగినటువంటి ఓ సంఘటన వల్ల పెద్ద ఎత్తున వీరిద్దరి మధ్య వివాదం కొనసాగుతోంది. దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించినటువంటి అలయ్ బలయ్ కార్యక్రమానికి గరికపాటి నరసింహారావుతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అయితే చిరంజీవి అక్కడికి రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు తనను చుట్టుముట్టి తనతో సెల్ఫీ దిగడానికి ఎగబడ్డారు.
ఈ క్రమంలోనే గరికపాటి చిరంజీవి వ్యవహారం పై అసహనం వ్యక్తం చేశారు.చిరంజీవి గారు ఫోటో సెషన్ ఆపి ఇక్కడకు రావాలి లేదంటే నాకు సెలవు ఇప్పించండి అంటూ అసహనం వ్యక్తం చేయడంతో ఈ విషయం తీవ్ర దుమారం రేపిన సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి పాల్గొనగా అక్కడికి కొందరు మహిళలు చిరంజీవితో ఫోటో దిగడానికి వచ్చారు. ఈ క్రమంలోనే చిరంజీవి ఇక్కడ వారు లేరు కదా అంటూ పరోక్షంగా గరికపాటిని ఉద్దేశించి చెప్పారు.
ఈ క్రమంలోనే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది చిరు అభిమానులు గరికపాటికి సరైన పంచ్ పడింది అంటూ కామెంట్ చేశారు. అయితే చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా గతంలో గరికపాటి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియోలో భాగంగా గరికపాటి మాట్లాడుతూ తనని ప్రవచనాలు చెప్పడానికి ఎవరు ఆహ్వానించారని తెలిపారు.
ఇలా ప్రవచనాలు చెప్పడానికి ఆహ్వానించరు కానీ తన ఇంట్లో పెళ్లి జరుగుతుంది మా మనవరాలు బారసాల జరుగుతుంది. మా కుటుంబ సభ్యులను ఆశీర్వదించడానికి రండి అంటూ ఆహ్వానిస్తుంటారని తెలిపారు.ఇలా తమ ఇంటికి వెళ్లి తమ కుటుంబ సభ్యులను ఆశీర్వదించడానికి తమకు పెద్ద ఎత్తున డబ్బును కూడా ఇస్తామంటూ ప్రలోభ పెడుతుంటారని గరికపాటి అసహనం వ్యక్తం చేశారు.ఇలా మీ ఇంటికి వచ్చే ఆశీర్వదించడానికి నేనేమైనా సెలబ్రిటీనా మమ్మల్ని సెలబ్రిటీలు చేయొద్దు అంటూ మండిపడ్డారు. అదేవిధంగా ఇలాంటి ఫంక్షన్లకు నన్ను ఆహ్వానించవద్దు అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…