Garikapati : స్మగ్లర్ కూడా తగ్గేదేలే అంటాడు… పుష్ప సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన గరికపాటి!

Garikapati Narasimha Rao: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో గత ఏడాది డిసెంబర్ 17వ తేదీ విడుదలైన పాన్ ఇండియా చిత్రం పుష్ప గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ సినిమా అన్ని భాషలలో విడుదల అయ్యి రికార్డులను క్రియేట్ చేయడంతో బన్నీ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Garikapati Narasimha Rao: స్మగ్లర్ కూడా తగ్గేదే లే అంటాడు… సమాజానికి ఏం చెబుతున్నారంటూ… ఫైర్ అయిన గరికపాటి!

అయితే తాజాగా ఈ సినిమాపై పద్మశ్రీ అవార్డు గ్రహీత గరికపాటి నరసింహారావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ మలిచిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కాలంలో సినిమాలు రౌడీ, ఇడియట్ వంటి సినిమాలు వస్తున్నాయి. అంతెందుకు మొన్న విడుదలైన పుష్ప సినిమాలో స్మగ్లింగ్ చేసే వారిని హీరోలుగా చూపించారు.

Garikapati Narasimha Rao: స్మగ్లర్ కూడా తగ్గేదే లే అంటాడు… సమాజానికి ఏం చెబుతున్నారంటూ… ఫైర్ అయిన గరికపాటి!

ఇలా చూపించడం వల్ల సమాజానికి ఏం చెబుతున్నట్టు అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ సినిమాలో హీరో ఒక స్మగ్లర్ ఆయన కూడా తగ్గేదే లే అంటాడు. ఆ పదం ప్రస్తుతం ఒక ఉపనిషత్తుగా మారిపోయింది. ఈ విషయంపై హీరో లేదా డైరెక్టర్ నాకు సమాధానం చెప్పమనండి అందరిని కడిగి పడేస్తాను.

స్మగ్లర్ ఆ మాట అనకూడదు…

ఈ విధమైనటువంటి డైలాగులు పాత్రల ద్వారా సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయి అంటూ పుష్ప సినిమాలో పుష్ప రాజ్ పాత్రపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తగ్గేదే అనే పదాన్ని ఒక స్మగ్లర్ అనకూడదు..ఒక హరిశ్చంద్రుడు లేదా ఒక శ్రీరామచంద్రుడు ఆ పదాన్ని ఉపయోగించాలని ఆయన ఈ సినిమాపై ఫైర్ అయ్యారు.మరి గరికపాటి వ్యాఖ్యలకు పుష్ప డైరెక్టర్ సుకుమార్ లేదా బన్నీ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.