Gautham: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈయన వారసుడు గౌతమ్ ఇదివరకే బాలు నటుడిగా మహేష్ బాబు నటించిన నేనొక్కడినే సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈ ఒక్క సినిమాలోని నటించిన గౌతమ్ అనంతరం సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఇలా గౌతమ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ప్రస్తుతం పై చదువుల కోసం విదేశాలకు వెళ్లే అక్కడ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. దీంతో ఈయన పెద్దగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండరు.కానీ సీతార మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండటమే కాకుండా ఇప్పటికే పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.
తాజాగా సితార ప్రమోట్ చేస్తున్నటువంటి పీఎంజే జ్యువెలరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నమ్రత కూడా హాజరయ్యారు. ఇకపోతే మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి వీరికి ప్రతినిధులు ఓ ఆసక్తికరమైన ప్రశ్న వేశారు గౌతమ్ హీరోగా ఎప్పుడు ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు అమృత సమాధానం చెబుతూ ప్రస్తుతం తన కుమారుడికి ఇంకా 16 సంవత్సరాల వయసు మాత్రమే ఉందని తెలిపారు. తాను ప్రస్తుతం చదువుపై దృష్టి పెట్టారని అయితే తాను గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలనుకుంటున్నారు అందుకే సినిమాలపై ఆసక్తి పెట్టడం లేదని, తన గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తరువాతనే ఇండస్ట్రీలోకి వస్తారంటూ నమ్రత తెలిపారు.ఇలా తన గ్రాడ్యుయేషన్ పూర్తి అయి ఇండస్ట్రీలోకి రావడానికి సుమారు 8 సంవత్సరాల వరకు సమయం పట్టొచ్చు అంటూ ఈమె చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…