Featured

Gayatri Guptha : ఐస్ క్రీం 2 సినిమాకు ఒక్క రూపాయి కూడా ఆర్జివి ఇవ్వలేదు…: నటి గాయత్రి గుప్తా

Gayatri Guptha : ఐస్ క్రీం 2, ఫిదా, బంధుక్ వంటి సినిమాలలో నటించి తాజాగా దయ వెబ్ సిరీస్ లో స్వేచ్చ అనే పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్న గాయత్రి గుప్తా అంతకు ముందు బిగ్ బాస్ తెలుగు మీద కేసులు వేసి ఫేమస్ అయింది. ఒపన్ గా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే గాయత్రి తెలంగాణ సంగారెడ్డి జిల్లా, జోగిపేట్ లో జన్మించింది. ఇంట్లో నుండి బయటికి వచ్చి మొదట సాక్షి న్యూస్ ఛానెల్ లో పనిచేసిన గాయత్రీ ఆపైన సినిమాల్లో నటించింది. అయితే సినిమాల్లో అవకాశాల కోసం వెళ్లిన సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి ఒపనే గా చెప్పి సెన్సేషన్ అయింది.

ఆర్జివి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు…

గాయత్రి గుప్తా మొదట బంధుక్ సినిమాలో నటించిన మొదట విడుదల అయినా సినిమా మాత్రం రామ్ గోపాల్ వర్మ ఐస్ క్రీం 2. ఆ సినిమాకు ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ ఇవ్వలేదు. ఇదే విషయం ఆర్జీవిని ఇంటర్వ్యూ చేసినపుడు అడిగాను అంటూ చెప్పారు గాయత్రి. అయితే ఐస్ క్రీం సినిమా ఆడిషన్ వెళ్ళినపుడే అక్కడ వాళ్ళు చెప్పారు.

రెమ్యూనరేషన్ ఇస్తామనే నమ్మకం పెట్టుకోవద్దు సినిమా విడుదల అయితే కానీ చెప్పలేమని మొదటే చెప్పారు. అయితే రామ్ గోపాల్ వర్మ వంటి డైరెక్టర్ తో పనిచేసే అవకాశం కంటే ఇంకేం కావాలి అని రెమ్యూనరేషన్ లేకుండానే చేసానంటూ చెప్పారు గాయత్రి. అయితే చాలా సినిమాలకు తనకు ఇప్ప్పటికి రెమ్యూనరేషన్ ఇస్తామని అడ్వాన్స్ ఇచ్చి చేతులు దులుపుకున్న వాళ్ళు ఉన్నారు. అలా ఇప్పటికి నాకు 14 లక్షలు రావాలి కానీ అవి ఇక రావని వదిలేసాను అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

16 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

17 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

24 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago