Featured

Gayatri Guptha : అందరి బాగోతాలు బయటపెడుతా.. ఎవరికీ భయపడను…: గాయత్రీ గుప్తా

Gayatri Guptha : ఐస్ క్రీం 2, ఫిదా, బంధుక్ వంటి సినిమాలలో నటించి తాజాగా దయ వెబ్ సిరీస్ లో స్వేచ్చ అనే పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్న గాయత్రి గుప్తా అంతకు ముందు బిగ్ బాస్ తెలుగు మీద కేసులు వేసి ఫేమస్ అయింది. ఒపన్ గా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే గాయత్రి తెలంగాణ సంగారెడ్డి జిల్లా, జోగిపేట్ లో జన్మించింది. ఇంట్లో నుండి బయటికి వచ్చేసి మొదట సాక్షి న్యూస్ ఛానెల్ లో పనిచేసిన గాయత్రీ ఆపైన సినిమాల్లో నటించింది. అయితే సినిమాల్లో అవకాశాల కోసం వెళ్లిన సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి ఒపనే గా చెప్పి సెన్సేషన్ అయింది.

అందరి బాగోతాలు చెప్తాను.. భయపడను….

గాయత్రీ ‘దయ’ హిట్ తో మరోసారి ఇంటర్వ్యూ లలో బిజీగా ఉంది. తాజాగా ఇంటర్వ్యూ లో గతంలో తాను ఇండస్ట్రీ గురించి చేసిన వాఖ్యల గురించి మాట్లాడుతూ పదేళ్ల నుండి చాలా మంది వల్ల బాధపడి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. అందుకే డిప్రెషన్ నుండి హీల్ అవడానికి ఇండస్ట్రీ లోని అన్ని విషయాలను మీడియా ద్వారా బయటపెట్టాను. దాని వల్ల డిప్రెషన్ నుండి హీల్ అయ్యాను అంటూ గాయత్రి తెలిపారు. ఇక బిగ్ బాస్ సమయంలో జరిగింది నేను పోరాడింది వెరైతే మీడియాలో నేను క్యాస్టింగ్ కౌచ్ కోసం పోరాడినట్లు మార్చేశారు.

నిజానికి నేను వర్క్ ఎత్తిక్స్ కోసం పోరాడను. వాళ్ళు బిగ్ బాస్ కి వచ్చే ముందు కొన్ని రోజులు ఎవరికీ చెప్పకూడదు. ఎక్కడ కనిపించకూడదు ప్రాజెక్ట్స్ చేయకూడదు అని చెప్పినపుడు దానికి వాళ్ళ నుండి డబ్బు రావాలి అది చెప్పలేదు. అలాగే నాతో సంతకం చేయించుకున్న బాండ్ పేపర్ ఒక కాపీ అడిగితే ఇవ్వలేదు దాని కోసం కోర్ట్ కి వెళ్ళాను. కానీ ఆపైన ఆ కేసు డైల్యూట్ అయిపోయింది. ఇక నా హెల్త్ బాగోలేక నేను పట్టించుకోలేదు అంటూ గాయత్రి తెలిపారు. ఇప్పటికి ఎవరైనా నాతో తేడాగా ప్రవర్తిస్తే ఓపెన్ గా చెప్పేస్తాను అంటూ గాయత్రీ తెలిపారు.

Bhargavi

Recent Posts

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

1 day ago

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకకు ముప్పు తెస్తున్న కొత్త జీవనశైలి ఇదే!

ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…

1 day ago

మధుమేహం, గుండె జబ్బులు లేకుండా పిల్లలు పుడతారా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది!

వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…

1 day ago

కరివేపాకుతో బరువు తగ్గొచ్చా? రోజూ ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…

1 day ago

83 ఏళ్ల వయసులోనూ అదే కసి.. ఒక సీన్ కోసం నిద్ర మానేసిన అమితాబ్ బచ్చన్!

సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…

1 day ago

పీరియడ్స్ సమయంలో యోగా చేయొచ్చా? అపోహలు పక్కన పెట్టండి.. నిపుణులు చెబుతున్న నిజాలు ఇవే!

నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…

1 day ago