Thamannah: టాలీవుడ్ మిల్క్ బ్యూటీగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి తమన్న ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈమె జైలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి తమన్నా రజినీకాంత్ గారితో నటించడం గురించి మాట్లాడుతూ తన సంతోషం వ్యక్తం చేశారు. చిన్నప్పటినుంచి రజనీకాంత్అంటే తనకు చాలా ఇష్టం ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. అయితే రజనీకాంత్ గారితో ఒక ఫోటో అయిన దిగాలన్నదే తన కోరిక అని తెలిపారు. కానీ ఆ కోరిక నెరవేరుతుందా లేదా అని ఆలోచిస్తూ ఉండేదాన్ని కానీ నెల్సన్ కారణంగా ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చిందని అందుకు డైరెక్టర్ నెల్సన్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇకపోతే తన సినీ కెరియర్ గురించి కూడా తమన్న మాట్లాడుతూ తాను కెరియర్ పరంగా ఇప్పటికీ ఏదైనా బాధపడే విషయం ఉందా అంటే అది ప్రభాస్ తో చేయాల్సిన సినిమా అని తెలియజేశారు.ప్రభాస్ హీరోగా నటించిన మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాలో ముందుగా తనకే హీరోయిన్గా అవకాశం వచ్చిందని తెలిపారు. అయితే అప్పటికే తాను బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాలో నటించలేకపోయాను.
ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమాలో తానే నటించి ఉంటే బాగుండేదనిపించింది.ఇలా ఈ సినిమాని మిస్ చేసుకున్నందుకు తాను ఇప్పటికీ బాధపడుతూనే ఉంటానంటూ ఈ సందర్భంగా తమన్న తెలిపారు. అయితే ఈమెకు మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో అవకాశం వచ్చిందని తెలిపారు కానీ అది కాజల్ పాత్రలోనా లేక తాప్సి పాత్రలోనా అన్న విషయం మాత్రం తెలియలేదు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…