Geetha Krishna : సినిమా ఇండస్ట్రీ లో హాట్ టాపిక్స్ గురించి తనదైన శైలిలో మాట్లాడుతూ నిత్యం వైరల్ అవుతున్న సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ మరోసారి మెగాస్టార్ ను, చంద్ర మోహన్ ను కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయ్యారు. కొన్ని పాత్రలకు కొందరు సూట్ కారని, ప్రేక్షకులు ఆ పాత్రల్లో వారిని చూడలేరని మాట్లాడారు. ఇమేజ్ ని దాటి సినిమా చేస్తే జనాలు చూడరని చెప్పారు గీతా కృష్ణ. ఒకడు పైకి వచ్చాడంటే వాడు వేరే దేశాస్థుడైనా మన తెలుగు పేరు తగిలించి మనవాడే అని చెప్పుకుంటూ తిరుగుతాం, అది మన నైజం అంటూ సటైర్లు వేశారు.
చిరంజీవి ఆ సినిమాలో చూడలేక పోయారు…
తమిళ రీమేక్ గా వచ్చిన మంచు పల్లకి సినిమాలో చిరంజీవి, సుహాసిని చావు బతుకుల మధ్య ఉంటే ఏడుస్తాడు ఆ సీన్ జనాలకు నచ్చలేదు. చిరంజీవి ఏడ్చడాన్ని జనాలు ఒప్పుకోలేదు. అప్పటికి చిరు ఇంకా పెద్ద స్టార్ హీరో కాదు అయినా చిరంజీవి అంటే డాన్స్, ఫైట్ అనే భావనలో ఉన్న ప్రేక్షకులకు అలా ఏడవడం నచ్చలేదు సినిమా ఫ్లాప్ అయింది. ఇక అలాగే ‘ఆపద్బాంధవుడు’ సినిమా వంటి సినిమాలు కూడా చిరంజీవి ఇమేజ్ కి దూరంగా ఉండే సినిమాలు అందుకే పెద్దగా సక్సెస్ అవ్వలేదు. అయితే కమల్ హాసన్ కూడా కథాబలం ఉన్న సినిమాలు చేసాడు.
అందులోనూ గోచి పెట్టుకున్న పాత్రలు చేసాడు అలా చూపించిన డైరెక్టర్ గొప్పోడు, అయినా జనాలు చూసారు. ఆ సినిమాలో కమల్ హాసన్ ను కానీ, చిరంజీవి ని అలా భావించము ఇమేజ్ దాటి చేస్తే ప్రేక్షకులు ఒప్పుకోరు అంటూ చెప్పడు. ఇక కమల్ హాసన్ గారి తమిళ సినిమా రీమేక్ తెలుగులో చంద్ర మోహన్ శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన ‘పదహారేళ్ల వయసు’ సినిమాలో చంద్ర మోహన్ నటనను అనవసరంగా పొగుడుతున్నారని, కమల్ హాసన్ చేసిన దాంట్లో పది శాతం కూడా నటించలేదంటూ ఘాటుగా స్పందించారు. మన తెలుగు వాడు కాబట్టి మనం కమల్ ను దాటి నటించాడు అంటూ గొప్పలు చెప్పుకుంటాం అంతే అంటూ కామెంట్స్ చేసారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…