Featured

Bhuma Mounika Reddy : మంచు మనోజ్, భూమా మౌనికల పెళ్లి..! ఇంతకీ వీరికి ఎలా పరిచయం, భూమా మౌనిక బ్యాక్ గ్రౌండ్ ఏంటి ??

Bhuma Mounika Reddy : నిన్నటి నుండి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వార్తల్లో హీరో మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్త ఒకటి. ఇన్ని రోజులు మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకుంటాడు అంటూ వార్తలు వినిపించినా పెద్దగా ఆధారాలు కనిపించలేది అయితే నేడు మౌనిక రెడ్డి తో కలిసి మనోజ్ సీతాఫల్ మండి దగ్గరి వినాయకుణ్ణి దర్శించుకోవడంతో ఇక వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై మంచు మనోజ్ ని మీడియా మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారా అని అడిగితే మంచి రోజు చూసుకుని చెబుతా అంటూ సమాధానం చెప్పడంతో ఈ వార్తలు నిజమే అంటూ అందరూ భావిస్తున్నారు.

ఇద్దరూ వ్యాపార భాగస్వాములు…

ఏపీ రాజకీయాలు తెలిసిన వారికి భూమా కుటుంబం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కర్నూల్ జిల్లా రాజకీయాల్లో ఆళ్లగడ్డకు చెందిన బలమైన నేత భూమా నాగిరెడ్డి, అయన భార్య శోభా నాగిరెడ్డి ఇద్దరూ ఎంపీ, ఎమ్మెల్యే గా పలుమార్లు గెలిచారు. అయితే 2014 లో ఎన్నికల ప్రచారం ముగించుకొని వస్తూ యాక్సిడెంట్ లో శోభా నాగిరెడ్డి మరణం కుటుంబాన్ని కుదిపేసింది. భూమా నాగిరెడ్డి గారికి ఇద్దరు కుమార్తెలు అఖిల ప్రియా, మౌనిక రెడ్డి ఒక కుమారుడు జగత్ విఖ్యత్ రెడ్డి ఉన్నారు. తల్లి మరణం తరువాత భూమా అఖిల ప్రియా, మౌనిక రెడ్డీలు తండ్రి కి చేదోడు వాదోడుగా ఉన్నారు. ఇక మౌనిక రెడ్డి నాగిరెడ్డికి రెండో కుమార్తె తన వివాహం 2016 లో చిత్తూర్ కి చెందిన వ్యాపార వేత్త గణేష్ రెడ్డి తో జరిగింది. వీరికి ఒక బాబు పుట్టాక మనస్పర్తల కారణంగా విడిపోయారు.

ఇక మౌనిక రెడ్డి 2017 లో తండ్రి మరణం తరువాత అక్క అఖిల ప్రియకు రాజకీయాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ నియోజకవర్గం మీద పట్టు నిలుపుకోవడంలో కీలకంగా పని చేసింది. ఇక 2018 లో మౌనిక రెడ్డి, గణేష్ లకు కొడుకు పుట్టగా 2020 లో ఇద్దరూ విడిపోయారు. ఇక మంచు మనోజ్, మౌనిక రెడ్డి వ్యాపార భాగస్వాములు గా ఉన్నారు. ఎం ఎం ప్యూరిటీ అండ్ మెడికల్ అప్లైయన్సెస్ అండ్ ఇన్స్ట్రుమెంట్ సంస్థకు చైర్ పర్సన్స్ గా ఉన్నారు. ఇక వీరిద్దరి కుటుంబాలకు పరిచయాలు ఉండటం వల్ల వీరి మధ్య పరిచయం ఏర్పడిందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఇద్దరూ హైదరాబాద్ లో కలిసే ఉంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Bhargavi

Recent Posts

రూ.250 కోట్లు డిమాండ్.. విజయ్-సంగీత విడాకుల కేసు హాట్ టాపిక్

తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…

25 minutes ago

వేసవిలో అమృతం లాంటి పానీయం.. ఈ నేచురల్ డ్రింక్ మీకు కూలింగ్ ఇస్తుంది!

వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…

31 minutes ago

కూతురు పెళ్లిపై కమల్ ఫోకస్.. శృతి హాసన్ మ్యారేజ్ టాక్ వైరల్

సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…

31 minutes ago

తిరుమలలో తమన్నా దర్శనం.. శ్రీవారి ఆశీస్సులు పొందిన స్టార్ హీరోయిన్!

ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…

2 hours ago

సబ్‌స్క్రిప్షన్ వివాదంపై అనన్య నాగళ్ల క్లారిటీ.. “అది నా ఉద్దేశ్యం కాదు!”

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె…

2 hours ago

శ్రీశైలంలో భక్తుడి అరుదైన కానుక.. వెండి నాగాభరణం సమర్పణ!

తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…

2 hours ago