Movie News

Geetha Krishna : శోభిత ధూళిపాళ్ళతో నాగచైతన్య డేటింగ్ చేస్తే తప్పేంటి… సమంత ట్వీట్ పై కామెంట్ చేసిన గీతాకృష్ణ…!

Geetha Krishna : సంకీర్తన సినిమాతో దర్శకుడిగా పరిచయమైన గీతాకృష్ణ, ఆతరువాత కొన్ని సినిమాలను తీసినా అంత గుర్తింపు అయితే రాలేదు. ఇటీవల ఇంటర్వ్యూలతో నెట్టింట్లో హోరేత్తిస్తున్న గీతాకృష్ణ చాలా మంది సెలబ్రిటీల గురించి కామెంట్స్ చేస్తూ వైరల్ అవుతున్నాడు. ఇక తాజాగా సమంత, నాగ చైతన్య గురించి కామెంట్స్ చేసి మరోసారి వైరల్ అయ్యారు.

వాళ్ళు డేటింగ్ చేస్తే తప్పేంటి…

సమంత, నాగచైతన్య పెళ్లి చేసుకుని నాలుగేళ్ళ తరువాత వీడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక విడిపోయాక సోషల్ మీడియాలో వీరి గురించి నిత్యం ఏదో ఒక టాపిక్ రన్ అవుతూనే ఉంది. అయితే తాజాగా బాలీవుడ్ మీడియాలో నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ళతో లవ్ లో ఉన్నాడంటూ కథనాలు రాయడంతో ఇపుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇక ఈ విషయంలో సమంతను టార్గెట్ చేస్తూ ఆమె ట్విట్టర్ ఖాతాలో అసభ్యకరంగా పోస్ట్ పెట్టాడు ఒక నెటిజెన్. ఇక వీటికి కౌంటర్ ఇస్తూ సమంత అమ్మాయిలపై రూమర్ వస్తే అది నిజం, అబ్బాయిల మీద రూమర్ వస్తే అది అమ్మాయిల ప్లాన్, వేక్ అప్ బాయ్స్ మేము మూవ్ ఆన్ అయ్యాము మీరు అవ్వండి అంటూ ట్వీట్ చేసింది.

ఇక దీనిపై గీత కృష్ణ స్పందించారు. సమంత, నాగచైతన్య పెళ్లి చేసుకున్నప్పుడు మూడో రోజే నేను వీళ్ళు విడిపోతారని అనుకున్నాను. ఇద్దరి కెరీర్ ఇంకా చాలా ఉంది అలాంటప్పుడు పెళ్లి చేసుకుంటే ఎలా అని అన్నారు. ఇక సమంత చాలా ఫ్రీడమ్ ఉన్న అమ్మాయి, తన కెరీర్ ను వదిలేసి హౌస్ వైఫ్ గా ఉండాలని అనుకోదు. ఇక మన సౌత్ ఇండియాలో జనాలు ఇంకా మారలేదు పెళ్ళయ్యాక ఒక హీరోయిన్ ఇంట్లో ఉండాలి అలాంటి సినిమాలు చేయరాదు, ఇలాంటి పాత్రలు వేయరాదు అంటూ అనుకుంటారు. వాళ్ళ ఇంటి అమ్మాయి ఏమో అన్నట్లు భావిస్తారు. సమంత మోడలింగ్ చేస్తూ బికినీ లో కూడా ఫోటో షూట్ చేసింది. ఇలాంటివి సౌత్ వాళ్లకు నచ్చవ్, నార్త్ లో ఇలాంటివి మామూలే కానీ, సౌత్ అలా కాదు అంటూ చెప్పారు. ఇక శోభిత తో నాగచైతన్య నిజంగా డేట్ చేస్తున్నా తప్పేముంది అందులో, అయితే మళ్ళీ సినిమాల్లో నటించే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పరిస్థితి ఏంటనేది ఆలోచించుకోవాలి అంటూ మాట్లాడారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago