Movie News

Suddhala Ashok Teja : శ్రమ దోపిడీ సినిమా రంగంలో ఉంది… నాకు మొదట్లో రెమ్యూనరేషన్ ఇచ్చేవారు కాదు…!

Suddhala Ashok Teja : తెలుగు రచయిత సుద్దాల అశోక్ తేజ తెలుగులో ఫేమస్ రైటర్. నమస్తే అన్న సినిమాతో మొదలైన ప్రస్థానం, నేడు 1250 సినిమాలలో 2200 పాటలను రాసారు. ఇక 2500 ప్రైవేట్ పాటలను కూడా రాసారు. సుద్దాల అశోక్ తేజ మొదట ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లిదండ్రులు తెలంగాణ ఉద్యమంలో పోరాడారు. ఇక తండ్రి స్ఫూర్తితో గేయాలు, పాటలు రాయడం నేర్చుకున్నారు. సినిమా పాటలను రాయడం కోసం చెన్నైకి వెళ్లిన అశోక్ తేజ కి మేనల్లుడు అప్పటికే ఇండస్ట్రీ లో గుర్తింపు తెచ్చుకున్న ఉత్తేజ్ సహాయం చేసాడు. ఇక నమస్తే అన్న అనే సినిమాకు మొదటిసారిగా పాటలు రాసిన అశోక్ తేజ రాములమ్మ సినిమాలో రాసిన పాటలకు మంచి గుర్తింపు వచ్చింది.

శ్రమ దోపిడీ సినిమా ఇండస్ట్రీలో ఉంది, నాకు రెమ్యూనరేషన్ మొదట్లో ఇవ్వలేదు…

ఇక సినిమా ఇండస్ట్రీలో మొదట్లో తాను పడిన కష్టాలను, అనుభవాలను చెప్పారు. చెన్నైలో ఉన్నప్పుడు పాట రాయించుకుని రెమ్యూనరేషన్ ఇచ్చేవారు కాదని, చాలా సార్లు ఇలా జరిగిందని, కొన్నిసార్లు తిండి పెట్టాం, వసతి కల్పించాము ఇక పాటకు డబ్బులు ఇవ్వము అని అనేవారట. ఇక కొన్నిసార్లు పాట రాసిన డబ్బు ఇస్తాము, కాకపోతే పేరు వేరేవాళ్లది వేస్తామని చెప్పేవారట. అలా అన్నప్పుడు డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు నా పేరే వేయండి అని అశోక్ గారు చెప్పేవారట. ఒకవేళ పది సినిమాలకు నాకు పారితోషకం ఇవ్వకపోయినా నా పేరు ఉంటుంది కనుక పది సినిమాలు చేసానని నా మార్కెట్ ఉంటుందని దాంతో నేను రాసే నెక్స్ట్ సినిమాలద్వారా సంపాదించుకుంటానని అని భావించేవారట.

ఇక ఠాగూర్ సినిమాకు వచ్చిన నేషనల్ అవార్డు విషయంలో వచ్చిన విమర్శల గురించి స్పందించారు. తనకు పాటలు రాయడంలో గురువుగారైన నారాయణ రెడ్డి గారు ఇలాంటి విమర్శలు మాములే పట్టించుకోవద్దు అంటూ చెప్పారట. శ్రీ శ్రీ గారి రచనను తీసుకున్నారు కనుక అవార్డు ఎలా తీసుకుంటారని అన్నారట, అయితే శ్రీ శ్రీ గారు కూడా గురజాడ గారి రచనల స్ఫూర్తిగా పాటలు రాసారు. అందువల్ల ఇటువంటి విమర్శలకు స్పందించనని చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago