Movie News

Geetha Krishna : రమ్య కృష్ణ ఆఫర్స్ ఎందుకు తగ్గిపోయాయంటే.. రమ్యకృష్ణ పై ఊహించని కామెంట్స్ చేసిన డైరెక్టర్ గీతాకృష్ణ

Geetha Krishna : తెలుగు సినిమా పరిశ్రమ లో కొంత మంది హీరోయిన్లు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు. కానీ కొంతమంది మాత్రం తమదైన ముద్ర వేస్తారు. అలాంటి హీరోయిన్లలో రమ్య కృష్ణ ఒకరు. ఆమె గ్లామరస్ పాత్ర చేసినా, ఒక దేవత లాగా చేసినా ఇక నెగెటివ పాత్ర చేసినా ఆమెకు ఆమె సాటి. ఇక ఈ మధ్య బాహుబలి లో శివగామిగా తన నటన అందరిని ఆకట్టుకునేలా, తాను తప్ప ఇంకెవరు చేయలేరు అనేలా చేసింది. తెలుగులో రమ్యకృష్ణ అయిన తన అసలు పేరు రమ్య కృష్ణన్. తమిళనాడులో పుట్టి పెరిగిన రమ్యకృష్ణ తండ్రిది నెల్లూరు. ఇక ఆమె తొలి తెలుగు సినిమా హీరోయిన్ గా సంకీర్తన. గీతా కృష్ణ దర్శకత్వంలో నాగార్జున, రమ్యకృష్ణ జంటగా నటించిన ఈ సినిమా ఒక క్లాసిక్ ఫిలిం.

ఆ విషయం ముందే తెలుసుంటే రమ్యకృష్ణ ను సంకీర్తనకు తీసుకునే వాడిని కాదు…

సంకీర్తన సినిమా టైములో కొత్త హీరోయిన్ ను పరిచయం చేయాలని గీతా కృష్ణ అనుకున్నాడట. నాగేశ్వరావు గారికి ఆమాటే చెప్పారట. నాగార్జున కొత్తగా పరిచయమవుతున్నాడు కాబట్టి, కొత్త హీరోయిన్ ను తీసుకోవాలని అనుకుని వెతకగా, రాజా సులోచన గారు తన డాన్స్ అకాడమీ ద్వారా హైదరాబాద్ లో జరిగిన ఫిలిం ఉత్సవ్ లో డాన్స్ చేయించగా, అందులో రమ్య కృష్ణ ని చూసి ఎంపిక చేశారట. అయితే రమ్య కృష్ణ అప్పటికే తమిళంలో ఒక సినిమా చేసినా తెలుగులో మొదటిది.

ఇక సినిమా అయిపోయి కోకిల సినిమా చేస్తున్న సమయంలో దాదాపు మూడేళ్లకు రమ్య ఇదివరకే తెలుగు సినిమాలో ఒక చిన్న పాత్ర చేసిందట. ఒకవేళ ఈవిషయం ముందే తెలుసుంటే తనను తీసుకునే వాడిని కాదని పరోక్షంగా అన్నారు. ఇక రమ్య కృష్ణ నెమ్మదిగా మంచి హీరోయిన్ గా ఎదిగి హీరోతో సమానంగా నటించిన నరసింహ వంటి సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు రమ్య కృష్ణ కు అవకాశాలు తగ్గాయని దీనికి కారణం రెమ్యూనరేషన్, ఈ పాత్రకు వీళ్ళు బాగుంటారని దర్శకులు అనుకోవడం వళ్ళ రమ్య కృష్ణకు ఆఫర్స్ తగ్గాయని నా అభిప్రాయం అని గీతా కృష్ణ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago