Geetha Madhuri: సినిమా ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సింగర్ గీతామాధురి ఒకరు. ఈమె అద్భుతమైన గాత్రంతో ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించి ఇండస్ట్రీలో సింగర్ గా గుర్తింపు పొందారు. ఇక గీత మాధురి 2014వ సంవత్సరంలో నటుడు నందుని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు .ఈ దంపతులకు 2019 సంవత్సరంలో మొదటి బిడ్డకు జన్మనిచ్చారు.
ఈ చిన్నారికి దాక్షాయిని ప్రకృతి అనే పేరు కూడా పెట్టారు. ఇలా ఒక కుమార్తెకు జన్మనిచ్చినటువంటి గీతామాధురి ఇటీవల మరోసారి తల్లిగా మారిన సంగతి మనకు తెలిసిందే. ఈమె తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించడమే కాకుండా తన బేబీ షవర్ వేడుకలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
ఇకపోతే ఫిబ్రవరి 10వ తేదీ గీత మాధురి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే తాజాగా మరోసారి గీత మాధురి ఇంట్లో వేడుకలు జరిగాయని తన కుమారుడికి బారసాల వేడుకను ఎంతో ఘనంగా జరిపించారని తెలుస్తుంది.
ఘనంగా బారసాల…
ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఫోటోలను గీత మాధురి సోషల్ మీడియా వేదికగా తెలియజేయడమే కాకుండా తన కుమారుడి పేరును కూడా వెల్లడించారు ఇక తన కుమారుడికి ధ్రువ ధీర్ తారక్ అనే పేరును పెట్టారు. ఇలా ఈ అబ్బాయి పేరు చివరన ఎన్టీఆర్ పేరు తారక్ అని రావడంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ పేరును పెద్ద ఎత్తున లైక్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…