Geethakrishna : ఈ మధ్య సోషల్ మీడియాలో పాత సినిమా విషయాల గురించి వీడియోలు, ఆసక్తికర గాసిప్స్ వంటివి వైరల్ అవుతుంటాయి. అలాంటివాటిలో చిరంజీవి మీద మరణ మృదంగం సినిమా సమయంలో చంపేయాలని విష ప్రయోగం చేసారనే వార్తలు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. అప్పటి ఓల్డ్ వార్త పత్రికల్లో వార్త క్లిప్పింగ్స్ కూడా బాగా వైరల్ అయింది. అయితే ఇది ఎంత వరకు నిజం అన్న విషయం ఇప్పటి వాళ్లకు చాలా మందికి తెలియదు. ఇక ఈవిషయం మీద గీతా కృష్ణ స్పందించారు.
చిరంజీవి మీద చాలా మందికి ఈర్ష్య ఉండేది…
చిరంజీవి కష్టపడి ఏమాత్రం బ్యాక్ గ్రౌండ్ లేకుండా పైకి వచ్చాడు. కింద స్థాయి నుండి చిన్న పాత్రలు చేస్తూ హీరోగా ఎదిగిన తీరు అందరికి ఆదర్శమే. అలాంటి చిరు మీద నచ్చని, గిట్టని వారు చాలా మందే ఉంటారు ఇండస్ట్రీ లో. అప్పట్లో చిరు డాన్స్ కి అభిమానులు ఎక్కువ, అలా చిరంజీవి స్టార్ డమ్ రోజు రోజుకి పెరుగుతున్న సమయంలో చాలా మంది ప్రొడ్యూసర్ కొడుకులు ఇంకా ఇతర సినిమా వాళ్ళ ఇంట్లో వాళ్ళు సినిమాల గురించి, వ్యక్తుల గురించి మాట్లాడేవారు. అప్పుడు ఆ మాటలలో చిరంజీవి మీద ఉన్న ఈర్ష్య బాగా తెలిసేది.
వాడు పెద్ద హీరో అయిపోతున్నాడు వాడి డేట్స్ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది అంటూ కామెంట్స్ నాకు వినిపించేవి అంటూ గీతా కృష్ణ చెప్పారు. ఇక అలాంటి పరిస్థితుల్లో చిరు మీద చంపాలనే ప్రయత్నం జరిగి ఉండొచ్చు అంటూ చెప్పారు. తొక్కేయాలని ఎంత చూసినా తొక్కించుకోకుండా పైకి ఎదిగి మెగాస్టార్ అయ్యాడు చిరంజీవి అంటూ అప్పటి సంగతులను చెప్పాడు గీతా కృష్ణ.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…