Kareena Kapoor: అమీర్ ఖాన్… బాలీవుడ్ లోనే కాదు తెలుగులో కూడా అభిమానులు వున్నారు. తాజాగా అమీర్ ఖాన్ హీరోగా వస్తున్న సినిమా ‘లాల్ సింగ్ చద్దా’. ఆగష్టు 11 న ప్రేక్షకులకు ముందుకు రాబోతున్న ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. కరీనా కపూర్, అమీర్ ఖాన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అంతే కాకుండా మన టాలీవుడ్ యంగ్ హీరో అయిన అక్కినేని నాగ చైతన్య కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపించునున్నాడు. హాలీవుడ్ సినిమా ‘ఫారెస్ట్ గంప్’ కు రీమేక్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే కామెడీ- డ్రామా గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రస్తుతం రన్ అవుతున్నాయి. అయితే ఈ క్రమంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ హాట్ టాపిక్ గా వుంది.
సినిమా చూస్తూ నిద్రపోతున్న కరీనా…
విడుదల సమయం దగ్గర పడుతుందటం తో సినిమా ప్రీమియర్ షోలు మొదలైనాయి. ఇటీవల జరిగిన ఒక షో లో అమీర్ ఖాన్, తన మాజి భార్య కిరణ్ రావు, ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కరీనా కపూర్ తో కలసి సినిమా చూసారు. ఈ షో చూస్తున్నపటి ఒక ఫోటో ఒక్కటి వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో అమీర్ తో కలసి సినిమా చూస్తున్న కరీనా నిద్రపోతు కనిపిస్తోంది. కరీన కపూర్ తన తలను ఎడమ చేతిపై వాల్చి, గాఢ నిద్రలోకి వెళ్లినట్లు కనిపిస్తుంది.
సహార్స్ అనే ఒక నెటిజన్ వీరికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలో అమీర్ మధ్యలో కూర్చుని ఉండగా, కిరణ్ రావు ఆయనకు కుడివైపు, కరీనా ఆయనకు ఎడమ వైపు కూర్చున్నారు. అమీర్ ఖాన్ ఇంకా కిరణ్ రావు మాత్రం సినిమాని చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ఫోటోలను చూసిన నేటిజన్లు… “లాల్ సింగ్ చద్దా సినిమా బోరింగ్‌గా ఉన్నట్లు ఉంది అందుకేనేమో కరీనా నిద్రపోతోంది” అంటూ కొంతమనది కామెంట చేస్తే ఇంకొందరు తన సినిమా చూసుకోని ఆమిర్ బాగా ఎమోషనల్ అవుతున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…