Movie News

Anchor Udaya Bhanu: కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్ తో ఉదయభానుకు బిగ్ బాస్ అవకాశం.. షో మొత్తం రచ్చ రచ్చే?

Anchor Udaya Bhanu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా యాంకర్ గా గత 15 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఉదయభాను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె కెరియర్ మొదట్లో పలు సినిమాలలో నటించారు. అనంతరం యాంకర్ గా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ ద్వారా పెద్ద ఎత్తున సందడి చేశారు.

ఈ విధంగా నటిగా యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉదయభానుకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఉదయభానుకు బిగ్ బాస్ సీజన్6 లో పాల్గొనే అవకాశం వచ్చిందని పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి.ఇప్పటికే తెలుగులో ఈ కార్యక్రమం ఐదు సీజన్లను పూర్తిచేసుకుని ఆరవ సీజన్ ప్రసారం కావడానికి సిద్ధమవుతోంది.

ఇప్పటికే నిర్వాహకులు ఈ కార్యక్రమం ప్రసారం కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఇప్పటికే కంటెస్టెంట్ ల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి అయ్యిందని, కొందరి కంటెస్టెంట్ ల పేర్లు వినపడుతున్నాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా బుల్లితెరపై ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న వారిని అలాగే సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వారిని ఈ కార్యక్రమంలోకి కంటెస్టెంట్ గా తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

గతంలో బిగ్ బాస్ అవకాశం వచ్చిన రిజెక్ట్ చేసిన ఉదయభాను…

ఈ క్రమంలోనే బిగ్ బాస్ నిర్వాహకులు యాంకర్ ఉదయభానుకి కూడా ఈ సీజన్ లో అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.ఈమెకు గత సీజన్లోనే బిగ్ బాస్ అవకాశం వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఈమె ఈ కార్యక్రమంలోకి వెళ్ళలేదు. అయితే ఈసారి ఎలాగైనా ఈమెకు బిగ్ బాస్ కార్యక్రమంలో అవకాశం కల్పించాలని ఎలాగైనా తనని ఈ కార్యక్రమంలోకి తీసుకురావాలని నిర్వాహకులు తనకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.మరి ఉదయభాను గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈమె కనుక షోలోకి ఎంట్రీ ఇస్తే ఈ కార్యక్రమం మరో లెవల్ కు వెళ్తుందని చెప్పాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘పసివాడి ప్రాణం’ నటుడు బాబు ఆంటోనీ లైఫ్ ఇలా మారిపోయింది!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…

1 day ago

చూపు లేకపోయినా సంగీతంతో ప్రపంచాన్ని గెలిచిన వైకమ్ విజయలక్ష్మి!

చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…

1 day ago

కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా నిలిచిన మహా యోధులు వీరే..!

మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…

1 day ago

కొత్త దంపతులు ముత్యాలు ధరిస్తే ఇంత మార్పా..? ముత్యాలపై నిపుణుల విశ్వాసం ఇదే!

భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…

1 day ago

ఒకే రాశి వాళ్లు పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది..? తెలుసుకుంటే ఆశ్చర్యమే!

వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…

1 day ago

ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు అంటున్న వాస్తు నిపుణులు.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!

హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…

1 day ago