Geethu Royal: గీతు రాయల్ పరిచయం అవసరం లేని పేరు. బిగ్ బాస్ ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ తర్వాత ఎలాంటి కార్యక్రమాలలో పాల్గొనలేదు. బిగ్ బాస్ కార్యక్రమంలోకి అడుగుపెట్టిన గీతు రాయల్ విన్నర్ గా బయటకు వస్తానని భావించారు కానీ ఆరువారాలకే హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇలా ఈమె బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంతగానో ఎమోషనల్ అయ్యారు ఇప్పటికీ కూడా ఆ బాధ నుంచి బయటపడలేదని చెప్పాలి.
ఇక బిగ్ బాస్ కార్యక్రమం తరువాత తదుపరి సీజన్ క ఈమె బజ్ హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు కార్యక్రమాలలో పాల్గొంటూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా తనకు సంబంధించిన అన్ని విషయాలను వెల్లడిస్తున్నారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గీతూ తన వ్యక్తిగత విషయాలను కూడా బయటపెట్టారు.
నేను బిగ్‌బాస్ బజ్ చేసేటప్పుడు మా ఇంట్లో చాలా గొడవలు జరిగాయి.తల గోడకేసి కొట్టుకోవాలనిపించింది. ఎందుకీ లైఫ్.. చనిపోదాం అనుకున్న సమయంలో కూడా టీవీ షోలో పాల్గొని నాపై జోకులేస్తే నవ్వుకున్నాను. నేను చనిపోయినప్పుడు కూడా కచ్చితంగా ఒక వీడియో చేసి చనిపోతానని తెలిపారు. నేను గట్టిగా మాట్లాడుతాను చూడటానికి చాలా స్ట్రాంగ్ అనిపిస్తంది కానీ నేను చాలా వీక్ అని తెలిపారు.
మనిషి ఆరోగ్యానికి హానికరమైన సిగరెట్లు దాచినందుకు నేను షో నుంచి బయటకు వచ్చేశాను అని తెలిసి నా బుర్ర పాడైపోయింది. డెలివరీ బాయ్ నా చెప్పులు దొంగతనం చేశారని ఒక వీడియో చేసిన చాలా మంది నన్ను తిట్టారు నాపై చాలా నెగిటివ్ కామెంట్లు చేశారు. ఇక ఈమె భర్త నుంచి విడాకులు తీసుకుంది అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తల పై కూడా స్పందించారు నేను నా భర్త వికాస్ కలిసే ఉన్నామని తెలిపారు. అయితే మాకు ఇస్మార్ట్ జోడి అవకాశం వచ్చినప్పుడు నేను నా భర్త వికాస్ తో గొడవపడ్డాను గొడవ పడినప్పుడు తనతో మాట్లాడను ఇలా మాట్లాడనప్పుడు షో కి వచ్చి సంతోషంగా ఉన్నామని చెప్పలేము కదా అందుకే ఈ షో కి రాలేకపోయానని తెలిపారు. ఇక భార్యాభర్తలను తర్వాత చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి అలాగే మేము కూడా గొడవ పడుతుంటామని ఆ తర్వాత కలిసిపోతామని గీతు రాయల్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…