Disco Shanthi : తెలుగు సినిమాలో హీరోగా, విలన్ గా, కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అన్ని రకాల పాత్రలను సులువుగా చేసేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీహరి గారు చిన్న వయసులోనే అకస్మాత్తుగా మరణించి ఇండస్ట్రీ లోనూ, ఇటు ప్రేక్షకులను షాక్ కి గురిచేసారు. ఇక ఆయన భార్య అలనాటి తార డిస్కో శాంతి పెళ్లి తరువాత సినిమాలకు దూరమయ్యారు. ఇక తన భర్త శ్రీహరి గారు చనిపోయాక చాలా ఏళ్ల తరువాత ఇంటర్వ్యూ తో మరో సారి కనిపించారు. శ్రీహరి గారు చనిపోయాక పరిస్థితులు ఎలా మారిపోయాయో చెప్పారు.
బావ చనిపోయాక చాలా మారిపోయింది….
శ్రీహరి గారు (బావ) హాఠాత్తుగా మరణించాక దిక్కుతోచలేదు. ఆయన బ్రతికున్నపుడు నటించిన సినిమాల తాలూకు రెమ్యూనరేషన్ లు చాలా మంది బావ మరణించాక ఎగొట్టారు. బావ చనిపోయాక ఏడుస్తూ ఒక గదిలో ఉండిపోయాను చుట్టూ ఏం జరుగుతోంది అన్నది పట్టించుకోలేదు అంటూ శాంతి ఆమె ఆవేదన పంచుకున్నారు. శ్రీహరి గారి ఇంట్లో ఐదు కార్లు ఉండగా వాటిలో జాగ్వర్ కార్ కు నెల నెల ఈఏంఐ కడుతూ వచ్చేవారట. అయితే శ్రీహరి గారి మరణం తరువాత మూడు నెలలకే వచ్చి డబ్బు కట్టలేదని కారు తీసుకెళ్లి పోయారని శాంతి చెప్పారు. ఆ వ్యక్తి పేరు మనోహర్ అని అతను నాకు కనిపిస్తే చంపేస్తా అంటూ కోప్పడ్డారు. అంతకు ముందు కట్టిన డబ్బులు పోయి కార్ కూడా పోయింది. అలా రెండు కార్లు పోగొట్టుకున్నామని చెప్పారు.
ఇక ఆ తరువాత ఒకసారి ఇంట్లో దొంగతనం జరిగి నగలు పోయాయి. కానీ అది నేను గమనించలేదు మూడు నెలలకు పోలీసులకు ఫిర్యాదు చేశాను అయితే ఫలితం లేకుండా పాయిందని చెప్పారు శాంతి. ఉన్న అప్పులు తీర్చి అవసరానికి బంగారం తాకట్టు పెట్టి మరి అప్పులు లేకుండా చేశామని ఇప్పుడిప్పుడే కొంచం కుదుటగా ఉన్నాం పిల్లలు పెద్ద వాళ్ళు అయిపోయారు అంటూ శాంతి తెలిపారు. ఇక సినిమా అవకాశలు వస్తే మంచి పాత్రలు వస్తే చేయాలనుకుంటున్నట్లు బాధ మర్చిపోడానికి సినిమాల్లో నటించాలని అనుకుంటున్నట్లు చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…