Getup Seenu : జబర్దస్త్ షో గురించి గత కొద్దిరోజులుగా అనేక విమర్శలు, వివరణలు వస్తూ ఉన్నాయి. ఇక షో గురించి పక్కన పెడితే షోలో సుధీర్, రష్మిల బంధం గురించి బాగా జనాలకు ఆసక్తి ఎక్కువ, ఏ జబర్దస్త్ కమెడియన్ ఇంటర్వ్యూ ఇచ్చినా ఈ టాపిక్ కామన్ అయిపోయింది. జబర్దస్త్ ప్రేక్షకులు బాగా ఇష్టపడే జంట సుడిగాలి సుధీర్, రష్మీల కెమిస్ట్రీనే. వాళ్ళు నిజంగా ప్రేమించుకుంటున్నారేమో అనేంతలా వాళ్ళ కెమిస్ట్రీ పండింది. అయితే ఇప్పుడు వాళ్ళ రిలేషన్ నిజంగా ఏంటి అని అనేక ప్రశ్నలు మొదలైయ్యాయి.
సుధీర్ రష్మీ ల బంధం పై క్లారిటీ ఇచ్చిన శీను…
సుధీర్, రష్మీ ఇద్దరు ప్రేమించుకోవడం లేదని, వాళ్లిద్దరిది ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రమే అని షూటింగ్ అయిపోయాక ఎవరీ లైఫ్ వాళ్ళది అన్నట్లు చెప్పారు. సుధీర్ కి వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని క్లారిటీ ఇచ్చాడు గెటప్ శీను. ఇక జబర్దస్త్ నుండి తాను వదిలి వెళ్ళడానికి కారణం సినిమా అవకాశలు అంటూ చెప్పాడు.
జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ రెండింటిలోనూ చేస్తూ వచ్చాము. అయితే రెండింటి షూటింగ్ వరుసగా ఉండటం వల్ల నేను సెపరేట్ టీం లీడర్ గా ఇచ్చినపుడు రామ్ ప్రసాద్ నాలుగు స్క్రిప్ట్లు రాయాల్సి వచ్చింది. దానివల్ల స్కిట్ల క్వాలిటీ తగ్గుతోందని టీం లీడర్ గా తప్పుకున్నా. ఇక సినిమా అవకాశాల వల్ల జబర్దస్త్ చేయడం లేదని చెప్పారు. ఇక జబర్దస్త్ లో అందరూ బయటికి చెప్పరు కానీ చాలా సేవా కార్యక్రమాలకు డొనేషన్స్ ఇస్తారని, మాలో ఎవరికైనా కష్టమొచ్చినపుడు అందరం కలిసి సమస్యలో ఉన్నవాళ్లకు కొంత సహాయం చేస్తామని ఇవన్నీ బయటికి రావని అన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…