Hyper Aadi: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో హైపర్ ఆది ఒకరు. హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో గుర్తింపు పొందడమే కాకుండా రోజురోజుకు ఈయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇకపోతే హైపర్ ఆది వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమాని అనే విషయం మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా ఏమైనా అంటే ఈయన పరోక్షంగా వారి గురించి పెద్ద ఎత్తున సెటైర్లు వేయడం మనం చూస్తున్నాము.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా పవన్ కళ్యాణ్ గురించి హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. గత కొద్ది రోజుల క్రితం తాను పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా కలిశానని ఆది పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్ల సినిమాలో తాను కూడా చిన్న పాత్రలో నటిస్తున్నానని అందుకే ఆయనని కలిశానని ఆది పేర్కొన్నారు.
ఈ విధంగా ఆది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ అబ్బో పవన్ కళ్యాణ్ గారు ఏ మనిషి అండి… డబ్బు పై తనకు ఏమాత్రం ఆసక్తి లేదు డబ్బు ఎలాంటి వారినైనా మార్చేస్తుంది కానీ ఆయన మాత్రం మారడు. అలా డబ్బు పై వ్యామోహం లేని వ్యక్తి ప్రజలకు మంచి చేయాలని ఆలోచిస్తారు అంటూ పవన్ కళ్యాణ్ గురించి హైపర్ ఆది కామెంట్ చేశారు. ఇక ఆయన సినిమాలలో సంపాదించిన డబ్బు మొత్తం చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు ఇస్తున్నారు. అలాంటి సేవలో తాను కూడా భాగమవుతానని ఇక జనసేన పార్టీలో భాగంగా ఏదైనా ప్రచారానికి తనను ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని ఆది పేర్కొన్నారు.
ఒకవేళ జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం వస్తే పోటీ చేస్తారా అని యాంకర్ ప్రశ్నించగా ఆ ప్రశ్నకు ఆది సమాధానం చెబుతూ.. అలాంటి ఆశలు ఏమీ లేవని తెలిపారు.ఒకవేళ స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఈ అవకాశం ఇస్తే ఏం చేస్తారు అనే ప్రశ్న ఎదురవగా వాళ్లు ఎన్నో ఒడిదుడుకులు చూసి ఈ స్థాయికి వచ్చారు. తనుకు కూడా ఎంతో అనుభవం కావాలంటూ ఈ సందర్భంగా ఆది ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలోనే హైపర్ ఆది పవన్ కళ్యాణ్ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…