Featured

Getup Seenu : ఆ రోజు సూసైడ్ చేసుకోవాలని అనుకున్నా… సుధీర్ మళ్ళీ వచ్చేస్తాడు… చిరంజీవి గారి దగ్గర నేర్చుకుంది అదే : గెటప్ శీను

Getup Seenu : జబర్దస్త్ వల్ల మంచి గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం కమెడియన్స్ గా మంచి పేరు తెచ్చికుంటున్నవారిలో గెటప్ శీను ఒకడు. తాను ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసేస్తాడు. అందుకే అందరూ అతనికి బుల్లితెర కమలహాసన్ అంటూ బిరుదు కూడా ఇచ్చేసారు. ఇక శీను కి సినిమా అవకాశాలు బాగా వచ్చాయి. ఈ మధ్య చాలా సినిమాల్లో మంచి పాత్రలలో శీను కనిపిస్తున్నాడు. దీంతో జబర్దస్త్ లో కనిపించలేదు. ఇక సుధీర్, ఆది, అభి వంటి వారు వెళ్లిపోయారు కాబట్టి శీను కూడా వారి లాగే వెళ్లిపోయాడేమో అని అందరూ భావించినా శీను మళ్ళీ జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇచ్చి అందరినీ సర్ ప్రైజ్ చేసాడు.

చిరంజీవి గారి దగ్గర అది నేర్చుకోవాలి… సుధీర్ మళ్ళీ వచ్చేస్తాడు…

మళ్ళీ జబర్దస్త్ కి వచ్చిన శీను జబర్దస్త్ కి కొత్త కల తెచ్చాడు. మళ్ళీ విభిన్నమైన గెటప్ లతో ఆకట్టుకుంటూ ఉన్న శీను తాజగా దశావతారం సినిమాలో కమల్ హాసన్ లాగా ఎనిమిది గెటప్ లతో అలరించాడు. నిజంగానే బుల్లితెర కమల్ హాసన్ అనిపించుకున్నాడు. ఇక చిరంజీవి గారి సినిమా గాడ్ ఫాదర్ లో ఒక చిన్న పాత్రలో నటించిన శీను చిరు గారితో ఉన్న అనుబంధం గురించి చెప్పారు. ఆయన రీల్ మీదే కాదు రియల్ లైఫ్ లోనూ ఎంతో మందికి స్ఫూర్తి అంటూ చెప్పాడు. చిన్న ఆర్టిస్టులను కూడా గుర్తు పెట్టుకుని వారిని మెచ్చుకుంటారు. నన్ను తన కారులో ఈవెంట్ కి తీసుకెళ్లి అక్కడి నుండి ముంబై కి తీసుకెళ్లి అక్కడ సల్మాన్ ఖాన్ గారితో మాట్లాడుతూ నన్ను పరిచయం చేసారు. ఆయన రేంజ్ కి అది అవసరం లేదు అయినా ఆయన చిన్న వాళ్ళను కూడా గౌరవిస్తారు అంటూ శీను ఎమోషనల్ అయ్యారు.

చిరంజీవి గారితో ఈ అనుబంధానికి కారణం నాగబాబు గారే. జబర్దస్త్ లో నన్ను ప్రోత్సాహించిన నాగబాబు గారు చిరు గారికి నన్ను పరిచయం చేసి సినినాల్లో అవకాశం ఇప్పించారు అంటూ ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు. ఇక సుధీర్ గురించి చంద్ర గురించి మాట్లాడుతూ వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తే బాగుంటుంది, జబర్దస్త్ కి వస్తారనే అనుకుంటున్నాను అంటూ ఆశాభావం వ్యక్తం చేసాడు. సుధీర్ ను నేను, రామ్ ప్రసాద్ చాలా మిస్ అవుతున్నాము అంటూ చెప్పారు. కెరీర్ మొదట్లో అవకాశాల కోసం తిరిగే సమయంలో అవమానాలను భరించాను కానీ ఒక సందర్బంలో మాత్రం చనిపోవాలని అనిపించింది అంటూ చెప్పాడు. కానీ నా స్నేహితులు నాకు ధైర్యం చెప్పారు. ఆకలి విలువ, డబ్బు విలువ తెలుసు. అవమానాలే నాలో కసి పెంచాయి అంటూ శీను తన స్ట్రగల్ గురించి చెప్పాడు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago