Featured

Imandi Ramarao : అల్లు రామలింగయ్య గారి మూడో కొడుకు ఎలా చనిపోయాడంటే… కొడుకు చనిపోయాక ఆయన రియాక్షన్ చూసి అందరూ షాక్ : ఇమంది రామారావు

Imandi Ramarao : 1000 కి పైగా సినిమాలలో నటించిన అల్లు రామలింగయ్య గారు హాస్య ప్రధాన పాత్రలే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మెప్పించారు. అయితే ఆయన సినిమా రంగంలోకి రాక మునుపు హోమియోపతి డాక్టర్, అలాగే స్వాతంత్ర సమరయోధుడు. నాటకాల మీద మక్కువతో అలా సినిమా రంగంలోకి వచ్చిన ఆయన అనేక సినిమాల్లో హాస్యప్రధాన పాత్రల్లో నటించారు. 2004 లో ఆయన మరణించే వరకు ఆయన సినిమాల్లో నటించారు. ఇటీవలే అల్లు రామలింగయ్య గారి కుటుంబం ఆయన శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన గురించి ఒక ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామరావు గారు ఆయన గురించి ఆసక్తికర విషయాలను తెలిపారు.

కొడుకు చనిపోతే ఆయన రియాక్షన్…

అల్లు రామలింగయ్య గారి కూతురు సురేఖ ను మెగాస్టార్ చిరంజీవి కి ఇచ్చి వివాహం చేసిన సంగతి అందరికీ తెలుసు. ఇక ఆయన కుమారుడు అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా గీత ఆర్ట్స్ సంస్థ ద్వారా సినిమాలను తీస్తున్నారు. అలా అంచలంచెలుగా ఆయన తన వ్యాపారాలను పెంచి ఇప్పుడు అల్లు స్టూడియోస్ కూడా నిర్మిస్తున్నారు. మరోవైపు ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ఆహా ఒరిజినల్స్ కూడా సక్సెస్ అయింది. ఇలా అల్లు కుటుంబం నుండి హీరో గా వచ్చిన అల్లు అర్జున్ అగ్ర హీరోల్లో ఒకడిగా ఉన్నారు. అల్లు రామలింగయ్య గారిది మహోన్నత వ్యక్తిత్వం అంటూ సీనియర్ జర్నలిస్ట్ ఇమంది గారు అన్నారు. ఆయన హోమియో డాక్టర్ గా సేవలందిస్తూ నాటకాలు వేసేవారని అలా సినిమాల్లోకి వచ్చారని చెప్పారు.

ఇక హాస్య ప్రధాన పాత్రల్లో నటించిన ఆయన ఎంత ధైర్యవంతుడు అనే విషయం ఆయన మూడో కుమారుడు మరణించినపుడే తెలిసింది. అల్లు రామలింగయ్య గారి మూడో అబ్బాయి ట్రైన్ ప్రయాణం చేస్తూ తల ఎలక్ట్రిక్ పోల్ కి తగిలి అక్కడికక్కడే మరణించారు. అలా హాటాత్తుగా కొడుకు మరణించినా అల్లు రామలింగయ్య గారు చాలా ధైర్యంగా కుటుంబాన్ని ఓదార్చారు. వాడికి కాలం తీరిపోయింది మరణించాడు అని చెప్పారు చాలా నిబ్బరంగా కుటుంబానికి ధైర్యం చెప్పారు అంటూ ఆయన గురించి ఇమంది గారు తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago