Ping Pong Surya : ‘తపన’ సినిమాతో తెలుగులో పరిచయమైన పింగ్ పాంగ్ సూర్య రాజమౌళి ‘సై’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమా విజయంతో ఇండస్ట్రీలో మంచి అవకాశాలను అందుకుని హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్ లను చేస్తూ కేరర్ నిర్మించుకున్న సూర్య సై సినిమా తరువాత పింగ్ పాంగ్ సూర్య గా బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక చిరంజీవి గారి సినిమా ‘జై చిరంజీవ’ లో చిన్న పాత్ర చేసినా మంచి పేరు వచ్చింది. రాజమౌళి, చంద్ర సిద్ధార్థ, కరుణాకరణ్ వంటి దిగ్గజ దర్శకులతో పనిచేసిన సూర్య తన సినిమా కష్టాలను, అలాగే డైరెక్టర్స్ దగ్గర తాను నేర్చుకున్న విషయాలను ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
ఆ హత్య కేసుకి నాకు సంబంధం లేదు…
సూర్య ‘ఆ నలుగురు’ సినిమాలో నటించాక ఆ సినిమా లాంటి సినిమాలు సమాజం మీద ప్రభావం చూపిస్తాయి అని భావించి ‘కలియుగ’ అనే సినిమాను నిర్మించాడు. ఆ సినిమా కోసం ఆస్తులను మొత్తం పెట్టి రిస్క్ చేసిన సూర్య ఆ సినిమా విడుదల కోసం మళ్ళీ అంతే కష్టపడాల్సి వచ్చింది. ఫైనాన్స్ సరిపోక ఇక థియేటర్స్ లేక అపుడు చిన్న సినిమాలను ప్రొడ్యూస్ చేసే వ్యక్తి ఒకరున్నారు అంటూ సూర్య కి అతని సినిమా ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పడం తో రాకేష్ రెడ్డి అనే ఫైనాన్సర్ ను కలిసాడు సూర్య.
ఇక ఆ తరువాత హత్య కేసులో ఇరుక్కోవడం అన్నీ సూర్య జీవితంలో అనూహ్యంగా జరిగాయి. ఇక ఆ కేసు గురించి మాట్లాడుతూ సూర్య నేనే ఆయనకు కాల్ చేసి ముందు రోజు వెళ్ళాను. చంపాలని హనీ ట్రాప్ చేసి అలా చేసుంటే అలా నేనే కాల్ చేసి ఎందుకు వెళతాను, నేను ఏ తప్పు చేయలేదు అందుకే భయపడలేదు అంటూ చెప్పారు. ఇక కేసులో ఏ5 గా ఉన్న సూర్య ను మీడియాకి చెందిన కొంతమంది 25 లక్షలు ఇస్తే కేసు నుండి తప్పిస్తామని ఆఫర్ కూడా ఇచ్చారట. అయితే నేను ఏ తప్పు చేయకుండా అలా డబ్బు ఇచ్చి బయటికి రావాల్సిన పని లేదు అంటూ సూర్య చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…