Ghattamaneni Family: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ఘట్టమనేని ఫ్యామిలీ ఒకటి. సూపర్ సార్ కృష్ణ వారసుడిగా మహేష్ బాబు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అయితే ఈయన బాల నటుడిగాను హీరో గాను ఎంతో మంచి సక్సెస్ అందుకొని ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతూ ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతం మహేష్ బాబు వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
తాజాగా మహేష్ బాబు కుటుంబానికి సంబంధించి ఓ వార్త వైరల్ గా మారింది ఘట్టమనేని కుటుంబ సభ్యులలో ప్రతి ఒక్కరిలోనూ ఒక క్వాలిటీ ఉంది అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. మరి మహేష్ బాబు కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి ఈ కామన్ క్వాలిటీ ఏంటి అనే విషయానికి వస్తే… సూపర్ స్టార్ కృష్ణ స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగడమే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా కూడా గుర్తింపు పొందారు.
ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయనకు ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే వారికి సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు. అయితే అదే అలవాటు మహేష్ బాబుకి కూడా వచ్చింది ఈయన ఏకంగా మహేష్ బాబు ఫౌండేషన్ స్థాపించి పలు హాస్పిటల్స్ తో అనుసంధానం అయ్యి పిల్లలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు.
ఇక మహేష్ బాటలోనే తన పిల్లలు కూడా నడుస్తున్నారు సితార ఇంత చిన్న వయసులోనే ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. తాను నటించిన మొదటి యాడ్ కి గాను ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ రావడంతో ఈ డబ్బు అంతటినీ కూడా ఈమె మహేష్ బాబు ఫౌండేషన్ కి ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. అదే విధంగా తన పుట్టినరోజు సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పిల్లలకు ఉచితంగా సైకిళ్లు కొనిచ్చారు. ఇక గౌతమ్ సైతం మహేష్ బాబు ఫౌండేషన్ తో అనుసంధానమైనటువంటి ఆసుపత్రులకు వెళ్లి అక్కడ చిన్నారులను పలకరించి వారికి కానుకలు ఇవ్వడమే కాకుండా వారి ముఖంలో చిరునవ్వులు వచ్చేలా చేశారు. ఇలా ఘట్టమనేని కుటుంబంలో ప్రతి ఒక్కరిలో కూడా సహాయం చేయడం జాలి దయ అనే కామన్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పాలి.
తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన అన్నమయ్య జిల్లా ఘటనకు మరో కీలక మలుపు తిరిగింది. మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై దారుణానికి పాల్పడ్డాడని…
ఉదయం లేవగానే శరీరం తేలికగా అనిపించకపోతే రోజంతా ఏదో భారంగా ఉంటుంది. మలబద్ధకం సమస్య చాలా మందిని వేధిస్తున్న సాధారణ…
భారతదేశంలో ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన నగరాల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకొచ్చేది కాశీ. వేల ఏళ్ల చరిత్ర, అనేక పురాణ…
ఇటీవల కాలంలో ఫిట్‌నెస్‌పై ఆసక్తి గణనీయంగా పెరిగింది. జిమ్‌లకు వెళ్లేవారు మాత్రమే కాదు, బరువు తగ్గాలని భావించే వారు కూడా…
ఉదయం టీతో రెండు బిస్కెట్లు, సాయంత్రం కాఫీకి మరికొన్ని – ఇది చాలామందికి రోజువారీ అలవాటు. పిల్లలకు టిఫిన్ బాక్స్‌లో…
దేశవ్యాప్తంగా ఆధార్ సేవలను మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన కొత్త మొబైల్ యాప్‌కు ప్రజల నుంచి విశేష స్పందన…