పెళ్లి కోసం కొందరు తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేయడం మనం చూస్తూ ఉంటాం. అన్నం తినకుండా, ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటూ బెదిరిస్తూ ఉండటం మనం చూసి ఉంటాం. కానీ పెళ్లి కోసం తనతల్లి పై అలిగి ఏకంగాహోర్డింగ్ ఎక్కి బెదిరించిన ఘటన తాజాగా మధ్యప్రదేశ్ ఇండర్‌లో చోటు చేసుకుంది. ఓ టీనేజర్ పారదేశీపురలో ఉన్న బండారీ బ్రిడ్జి వంతెనపై గల భారీ హోర్డింగ్ ఎక్కి ఫోన్ చూసుకుంటే కనిపించింది. దీంతో ఆమెను చూసిన అందరూ ఆత్మహత్య చేసుకోవడానికి పైకెక్కింది భావించారు. కానీ ఆమెలో ఎలాంటి చలనం లేకపోవడంతో ఎంచక్కా హోర్డింగ్ పై కూర్చుని ఫోన్ లో మెసేజ్ చూసుకుంటూ ఉండటంతో సిగ్నల్స్ కోసం అంత పైకి ఎక్కిందా అని కొందరు కామెంట్ చేసుకున్నారు.
కానీ కొద్ది సమయానికి ఆమె బాయ్ ఫ్రెండ్ అక్కడికి రావడంతో ఏదో ప్రేమవ్యవహారం అనుకున్నారు. కానీ ఆ అంచనాలు కూడా కాదని ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి కోసం తన తల్లి పై అలిగి ఏకంగా హోర్డింగ్ ఎక్కి బెదిరిస్తుందని తెలియడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. తనింకా మైనర్ అయినప్పటికీ ఒక అబ్బాయిని ప్రేమించి పీకల్లోతులో ప్రేమలో మునిగి పోయింది. ఈ విషయం తన తల్లితో చెప్పి తన పెళ్లి చేయాల్సిందిగా అడగడంతో అందుకు తన తల్లి మందలించి బుద్ధిగా చదువుకోమని చెప్పింది. దీంతో ఆబాలిక తనతల్లి పై అలిగి ఏకంగా హోర్డింగ్ బోర్డ్ ఎక్కినిరసన తెలియజేసింది.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఆమెను కిందికి దిగి రావాల్సిందిగా కోరారు. కానీ ఆమె తన పెళ్ళికి తన తల్లి ఒప్పుకుంటేనే కిందికి దిగి వస్తానని డిమాండ్ చేయడంతో పోలీసులు ఆమె బాయ్ ఫ్రెండ్ కి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న అతను ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. కిందికి దిగమని తన బాయ్ ఫ్రెండ్ ఎంత బతిమిలాడినా ఆమె దిగకపోవడంతో పోలీసులు కలుగజేసుకొని మీ పెద్ద వారితో మాట్లాడుతాము కిందికి దిగమని సూచించడంతో ఆమె కిందికి దిగింది. అయితే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన సదరు నెటిజన్లు పిల్లలను సరైన క్రమశిక్షణలో పెరగకపోతే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయని కామెంట్ చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…