పెళ్లి కోసం తల్లిపై అలిగి హోర్డింగ్ ఎక్కిన బాలిక… చివరికి?

0
230

పెళ్లి కోసం కొందరు తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేయడం మనం చూస్తూ ఉంటాం. అన్నం తినకుండా, ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటూ బెదిరిస్తూ ఉండటం మనం చూసి ఉంటాం. కానీ పెళ్లి కోసం తనతల్లి పై అలిగి ఏకంగాహోర్డింగ్ ఎక్కి బెదిరించిన ఘటన తాజాగా మధ్యప్రదేశ్ ఇండర్‌లో చోటు చేసుకుంది. ఓ టీనేజర్ పారదేశీపురలో ఉన్న బండారీ బ్రిడ్జి వంతెనపై గల భారీ హోర్డింగ్ ఎక్కి ఫోన్ చూసుకుంటే కనిపించింది. దీంతో ఆమెను చూసిన అందరూ ఆత్మహత్య చేసుకోవడానికి పైకెక్కింది భావించారు. కానీ ఆమెలో ఎలాంటి చలనం లేకపోవడంతో ఎంచక్కా హోర్డింగ్ పై కూర్చుని ఫోన్ లో మెసేజ్ చూసుకుంటూ ఉండటంతో సిగ్నల్స్ కోసం అంత పైకి ఎక్కిందా అని కొందరు కామెంట్ చేసుకున్నారు.

కానీ కొద్ది సమయానికి ఆమె బాయ్ ఫ్రెండ్ అక్కడికి రావడంతో ఏదో ప్రేమవ్యవహారం అనుకున్నారు. కానీ ఆ అంచనాలు కూడా కాదని ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి కోసం తన తల్లి పై అలిగి ఏకంగా హోర్డింగ్ ఎక్కి బెదిరిస్తుందని తెలియడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. తనింకా మైనర్ అయినప్పటికీ ఒక అబ్బాయిని ప్రేమించి పీకల్లోతులో ప్రేమలో మునిగి పోయింది. ఈ విషయం తన తల్లితో చెప్పి తన పెళ్లి చేయాల్సిందిగా అడగడంతో అందుకు తన తల్లి మందలించి బుద్ధిగా చదువుకోమని చెప్పింది. దీంతో ఆబాలిక తనతల్లి పై అలిగి ఏకంగా హోర్డింగ్ బోర్డ్ ఎక్కినిరసన తెలియజేసింది.

ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఆమెను కిందికి దిగి రావాల్సిందిగా కోరారు. కానీ ఆమె తన పెళ్ళికి తన తల్లి ఒప్పుకుంటేనే కిందికి దిగి వస్తానని డిమాండ్ చేయడంతో పోలీసులు ఆమె బాయ్ ఫ్రెండ్ కి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న అతను ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. కిందికి దిగమని తన బాయ్ ఫ్రెండ్ ఎంత బతిమిలాడినా ఆమె దిగకపోవడంతో పోలీసులు కలుగజేసుకొని మీ పెద్ద వారితో మాట్లాడుతాము కిందికి దిగమని సూచించడంతో ఆమె కిందికి దిగింది. అయితే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన సదరు నెటిజన్లు పిల్లలను సరైన క్రమశిక్షణలో పెరగకపోతే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయని కామెంట్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here