God Father : ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 5 న మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా విడుదల కాబోతోంది. ఇక సినిమా గురించి ప్రచార కార్యక్రమాలు బాగా నిర్వహిస్తున్న చిత్ర బృందం చిరు, సత్య దేవ్ ఇంటర్వ్యూలతో జనాల్లోకి సినిమాను తీసుకెళ్తున్నారు. మలయాళం సినిమా లూసిఫర్ కి రీమేక్ గా రాబోతున్న ఈ సినిమా టీజర్, ట్రయిలర్స్ అలాగే పాటలు ఆకట్టుకున్నాయి. ఇక ఒక మాఫియా డాన్ రాజకియం చేస్తే ఎలా ఉంటుందో చిరు చూపించబోతున్నాడు. ఇప్పటికే సినిమలో పొలిటికల్ సటైర్లు ఉన్నాయంటూ బయటికి గుప్పుమనడంతో జగన్ మీద ఇండైరెక్ట్ కౌంటర్స్ అంటూ అందరూ భావిస్తున్నారు. ఇక సినిమా ఎలా ఉండబోతోందో అని అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ లో నందమూరి చిన్నోడి పేరు వినబడటం తో మెగా ఫ్యాన్స్ ఆశ్చర్య పోతున్నారు.
సత్యదేవ్ నోట ఎన్టీఆర్ పేరు… మండిపోతున్న మెగా ఫ్యాన్స్…
ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి సత్యదేవ్ నటన ను బాగా పొగిడేశారు. మంచి నటుడంటూ కితబిచ్చారు. ఇక సత్యదేవ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నపుడు ఇప్పుడున్న హీరోల్లో ఎవరితో చేయాలని ఉంది అని అడిగితే అల్లు అర్జున్, ఎన్టీఆర్ పేర్లు చెప్పాడట. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ తో నటించాలని చాలా కోరికగా ఉంది తనతో నటించడానికి ఎదురుచూస్తున్నాను అని చెప్పాడట.
ఇక ఈ విషయం ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా చక్కర్లు కొడుతోంది. అసలు మెగా హీరో సినిమా ప్రమోషన్స్ లోకి ఎన్టీఆర్ పేరు ఎందుకు వచ్చింది అని మెగా ఫ్యాన్స్ ఆరాలు మొదలు పెట్టారు. ఆల్రెడీ నందమూరి, మెగా ఫ్యామిలీ మధ్య మంచి బాండింగ్ ఉంది అయినా సరే ఫ్యాన్స్ మాత్రం ఇంకా ఎక్కడో కలిసి ఉన్నట్లు కనిపించడం లేదు. ఇక కావాలనే మీడియా వాళ్ళు ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకోచ్చారేమో అనే అనుమానాలు లేవనేత్తుతున్నారు కొందరు. ఏది ఏమైనా మెగా హీరో సినిమాలో ఎన్టీఆర్ పేరు రావడంతో నందమూరి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…