సాధారణంగా గోల్డ్ మెడల్ అనేది ఏదైనా పనిలో లేదా క్రీడలలో, చదువులో, చేసే ఉద్యోగాలలో విజయవంతం అయినప్పుడు ఆ విజేతల ప్రతిభకు గుర్తుగా గోల్డ్ మెడల్ అనేది ప్రధానం చేయడం మనకు తెలిసిందే. కానీ గోల్డ్ మెడల్ ఎప్పుడైనా జంతువులకు ఇవ్వడం మీరు విన్నారా? వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. జంతువులకు కూడా గోల్డ్ మెడల్ ప్రధానం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రిటైర్మెంట్ అయిన ఓ ఎలుక తన సేవలకు గుర్తుగా ఒక గోల్డ్ మెడల్ ను సంపాదించుకుంది. అసలు ఎలుక ఏంటో? గోల్డ్ మెడల్ ఏంటో ఈ అయోమయ విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం….
ఎలుకలలో మగావా అనే ఎలుకను హీరో ఎలుక అని చెబుతారు.ఎందుకంటే ఈ ఎలుక సాధారణ ఎలుకల మాదిరిగా కాకుండా ఎంతో భిన్నంగా ఉంటుంది. ఈ ఎలుక చేసిన పని తెలిస్తే పొగడకుండా ఎవరూ ఉండలేరు. మందు పాత్రలను కనిపెట్టడంలో తన ప్రతిభను ప్రదర్శించిన ఎలుక ఏకంగా గోల్డ్ మెడల్ సంపాదించింది.
గత ఐదు సంవత్సరాల నుంచి మందు పాత్రలను కనిపెట్టే ఉద్యోగం చేస్తున్న ఎలుక అయిదేళ్లలో సుమారుగా 71 మందు పాత్రలను కనిపెట్టింది. ఇంకా చాలా మందు పాత్రలను వెతకాల్సి ఉండగా ఎలుక వయసు పైబడటంతో దీనికి ఇబ్బంది కలగకుండా తన ఉద్యోగానికి రిటైర్మెంట్ ను ప్రకటిస్తూ గోల్డ్ మెడల్ ను ప్రదానం చేశారు.గత 77 సంవత్సరాల నుంచి ఎలుకలకు గోల్డ్ మెడల్ ఇవ్వడం ఇదే తొలిసారి.
బెల్జియంకి చెందిన చారిటీ సంస్థ అపోపో..ఎలుకకు ట్రైనింగ్ ఇచ్చింది. ఈ సంస్థకు టాంజానియాలో కార్యాలయం ఉంది. ఈ సంస్థ 1990 నుంచి హీరోరాట్స్‌ని పెంచుతూ… వాటికి మందు పాతర్లను ఏ విధంగా కనిపెట్టాలో ట్రైనింగ్ ఇచ్చేది. ఇందులో భాగంగానే ఎలకలు మందుపాతరలలో ఉపయోగించేటటువంటి రసాయనాల వాసన చూసి వాటిని పసిగడతాయి. ఈ క్రమంలోనే మందు పాతరలు ఎక్కడ ఉన్నాయి అనే విషయాన్ని ఎంతో సులభంగా గుర్తించగలరని చారిటీ సంస్థ తెలిపింది.
విధి నిర్వహణలో భాగంగా మగవా అద్భుతమైన పనితీరును కనబరిచి ఏకంగా 71 మందు పాత్రలను గుర్తించి ఎంతో మంది ప్రాణాలను కాపాడింది. అందుకోసమే ఈ ఎలుకకు పదవి విరమణ అనంతరం గోల్డ్ మెడల్ సాధించిందని దీన్ని చూసుకుంటున్న మాలెన్ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…