బాహుబలి’ సినిమా తరువాత ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు హీరో ప్రభాస్. సాహో తరువాత నాలుగు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు ప్రభాస్. కేజిఎఫ్ తో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో “సలార్” సినిమా, ‘తన్హాజీ’ ఫేం ఓం రౌత్‌తో “ఆదిపురుష్” చిత్రం షూటింగ్ షూటింగ్ జరుగుతున్నాయి. అయితే రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయిపోయింది. ఆ తరువాత డైరెక్టర్ నాగ అశ్విన్‌తో ఓ సినిమా ప్లాన్ చేసాడు ప్రభాస్.
అయితే తాజాగా ప్రభాస్ ఆదిపురుష్ సినిమాకు భారీ రెమ్యూనరేషన్ అందుకున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. టీ-సిరీస్ ఫిల్మ్స్ సంస్థ ‘ఆదిపురుష్’ సినిమా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం టీ-సిరీస్ ఫిల్మ్స్ ప్రభాస్‌కు రూ. 50 కోట్లను పారితోషికంగా ఇస్తున్నట్లు తెలిసింది. ప్రభాస్ రాముడిగా, సీతగా కృతి సనన్ నటిస్తున్న ఈ చిత్రం పౌరాణికం నేపధ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జేట్‌తో రూపొందుతున్న ఈ సినిమా హిందీ మరియు తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. 2022 అగష్టు 11ను ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో థియేటర్లలోకి రానుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…