Indian Digital Currency: భార‌తీయుల‌కు శుభ‌వార్త‌..! ఆ రోజే డిజిటల్ కరెన్సీ ఆవిష్కరణ..

Indian Digital Currency: భార‌తీయుల‌కు శుభ‌వార్త‌..! ఆ రోజే డిజిటల్ కరెన్సీ ఆవిష్కరణ..

Indian Digital Currency: త్వరలోనే దేశంలో డిజిటల్ కరెన్సీ రాబోతోంది. ఇప్పటికే బడ్జెట్ లో ఈవిషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే  డిజిటల్ కరెన్సీ వచ్చ ఏడాది తొలినాళ్లలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రభత్వ వర్గాలు అంటున్నాయి.

Indian Digital Currency: భార‌తీయుల‌కు శుభ‌వార్త‌..! ఆ రోజే డిజిటల్ కరెన్సీ ఆవిష్కరణ..
Indian Digital Currency: భార‌తీయుల‌కు శుభ‌వార్త‌..! ఆ రోజే డిజిటల్ కరెన్సీ ఆవిష్కరణ..

ఇది ప్రైవేటు కంపెనీలు నిర్వహించే ఎలక్ట్రానిక్ వాలెట్ల రూపంలోనే ఉంటుందని.. కాకపోతే ప్రభుత్వ హామీ ఉండటం దీని ప్రత్యేకత.  రిజర్వ్ బ్యాంకు జారీచేసే ఈ కరెన్సీ యూనిట్లు.. ప్రస్తుతం చెలామనీ అవుతున్న పరిమిత స్ఘాయిలోని భౌతిక కరెన్సీ లాగే ఉంటుందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.

Indian Digital Currency: భార‌తీయుల‌కు శుభ‌వార్త‌..! ఆ రోజే డిజిటల్ కరెన్సీ ఆవిష్కరణ..

డిజిలట్ రూపంలో జారీ చేసే కరెన్సీ.. చెలామనీలో ఉన్న కరెన్సీలాగే ఉపయోగించవచ్చు. అయితే ఇది ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అంటే… వచ్చే ఏడాది తొలి నెలల్లో డిజిటల్ కరెన్సీ సిద్ధం అవుతుందని ఆర్బీఐ అధికారులు తెలిపారు. 

లావాదేవీలన్నీంటిని రిజర్వ్ బ్యాంక్ మానిటరింగ్..

ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మొబైల్ వాలెట్ల లావాదేవీలను పరిశీలిస్తే.. యూజర్లు ముందుగా ఓ ప్రైవేట్ కంపెనీకి తమ డబ్బును ట్రాన్ఫర్ చేస్తే.. ఆ తరువాత సదరు సంస్థ ఆ డబ్బును అవతలి పక్షానికి బదలాయిస్తోంది. ఇందుకు ఛార్జీలను కూడా వసూలు చేస్తోంది. అయితే ఇందులో రిస్క్ ఎక్కువగా ఉంటోంది. అదే డిజిటల్ రూపీని విషయానికి వస్తే.. మన డబ్బు రిజర్వ్ బ్యాంకు దగ్గర డిజిటల్ కరెన్సీ రూపంలో ఉంటుంది. మనం చేసే లావాదేవీలన్నీంటిని రిజర్వ్ బ్యాంక్ మానిటరింగ్ చేస్తుంది. దీంతో పాటు ప్రభుత్వ హామీ ఉంటుంది. వివాదాస్పద క్రిప్టో కరెన్సీలకు ప్రత్యామ్నాయంగా బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ ఆధారిత అధికారిక డిజిటల్‌ రూపీని ప్రవేశపెట్టనున్నట్లు బడ్జెట్‌ సందర్భంగా కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.