Sreeja Konidela: ప్రస్తుత కాలంలో సెలబ్రెటీ జంటల్లో విడాకులు తీసుకోవడం సర్వ సాధారణం అయిపోతున్నాయి. నాగచైతన్య- సమంత గతేడాది అక్టోబర్ 2న విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం టాలీవుడ్ తో పాటు ఇతర ఫిలిం ఇండస్ట్రీల్లో కూడా చర్చనీయాంశం అయింది.
ప్రేమించి.. ఒకరినొకరు అర్థం చేసుకొని పెళ్లి చేసుకున్న వీరిద్దరు నాలుగేళ్ల తమ అన్యోన్య బంధానికి ఫుల్ స్టాప్ పెట్టారు. భేదాభిప్రాయాలతో సమంత-నాగచైతన్య విడిపోయారు. ఈ విషయం వీరిద్దరి ఫ్యాన్స్ ను కూడా బాధపెట్టింది. అంతే కాదు సగటు తెలుగు అభిమానికి కూడా ఆశ్చర్యం కలిగించింది.
వీరిద్దరు విడాలకు తర్వాత కొన్ని రోజులకే కోలీవుడ్ లో మరో రొమాంటిక్ కపుల్ కూడా విడాకులు తీసుకున్నారు. తమిళ్ స్టార్ హీరో ధనుష్ తన భార్య ఐశ్వర్యతో విడిపోయినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది కూడా కోలీవుడ్ పరిశ్రమలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
ఇక టాలీవుడ్ లో మెగస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కూడా కళ్యాణ్ దేవ్‌కి విడాకులు ఇచ్చిందనే వార్తలు పుకార్లు షికార్లుగా మారాయి. గత కొన్ని రోజుల నుంచి ఈ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనికి గల కారణం ఏంటంటే.. గత కొన్ని రోజుల నుంచి కళ్యాణ్ మెగా కుటుంబంతో కలవక పోవడంతో ఈ వార్తలు వస్తున్నాయి. అంతే కాదు అతడి సినిమాలకు మెగా మద్దతు కూడా లేదు. దీంతోనే ఈ అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. అంతే కాదు.. సమంత మాదిరిగానే శ్రీజ కూడా తన పేరు పక్కన భర్త పేరును తొలగించడంతో శ్రీజ కూడా సమంత మాదిరిగానే విడాకులు తీసుకోబోతోంది అంటూ వార్తలు వచ్చాయి.
అంతే కాదు అతడు ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ తో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతోనే శ్రీజ అతడికి విడాకులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అతడు ఏ హీరోయిన్ తో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడనే వార్తలు మాత్రం బయటకు రాలేదు. ఇటీవల కళ్యాణ్ దేవ్ కూడా ఎంతో యాక్టీవ్ గా కనిపిస్తున్నాడు. సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో తాను ఎంతో సంతోషంగా ఉన్నాను అంటూ చెప్పడంతో.. ఈ సందేహాలకు బలాన్ని చేకూరినట్లు అవుతోంది. ఏదేమైనా టాలీవుడ్ లో మరో జంట విడాకులకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు మాత్రం వస్తున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…