Acharya Movie Release Date: మెగా అభిమానులకు గుడ్ న్యూస్..! ఆచార్య రిలీజ్ డేట్ వచ్చేసింది.. !
Acharya Movie Release Date: కోవిడ్-19 కేసుల పెరుగుదల కారణంగా ఈ సీజన్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొన్ని బాలీవుడ్ మరియు టాలీవుడ్ సినిమాలు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. RRR, రాధే శ్యామ్, బాలీవుడ్ జెర్సీ , సినిమాలు ఈ జాబితాకు చెందినవి.
ఇప్పుడు, చిరంజీవి రాబోయే చిత్రం ఆచార్య కూడా ఈ జాబితాలో చేరిన విషయం తెలిసిందే. ఈ మేరకు మేకర్స్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు చేశారు. అందులో ఏముందంటే.. ఫిబ్రవరి 4 వ తేదీన విడుదల కావాల్సిన మెగస్టార్ చిరంజీవి సినిమా ఆచార్య.. కోవిడ్ కేసుల కారణంగా వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ప్రకటన చేసి చాలా రోజులు అయింది. దీనిలో మళ్లీ ఎప్పుడు విడుదల చేస్తారనేది క్లారిటీ ఇవ్వలేదు.
దీంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. ఎప్పుడు తన అభిమాన హీరో సినిమా వస్తుందా అని ఎదురుచూశారు. ఇవన్నీ ఆలోచించిన మేకర్స్ తాజాగా ట్విట్టర్ లో ఆచార్య న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడు అనే విషయాన్ని చెప్పుకొచ్చారు. ఏప్రిల్ 1న ‘ఆచార్య’మూవీని విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించారు.
ఈ ఉగాదికి సందడి చేయడానిని మీ అభిమాన హీరో వస్తున్నాడు అంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో మెగాస్టార్ అభిమానులందరూ ఎంతో ఖుషీగా ఉన్నారు. దీంతో పాటు.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు… దయచేసి అందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. సురక్షితంగా ఉండండి అంటూ ట్విట్ లో పేర్కొన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయిక. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రామ్ చరణ్ తేజ్ కూడా ‘సిద్ధ’ అనే ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. నీలాంబరి పాత్రలో పూజా హెగ్డే రామ్ చరణ్ కు జోడీగా నటిస్తోంది. వీరితో పాటు సోనూసూద్, జిషు సేన్‌గుప్తా, సౌరవ్ లోకేష్, కిషోర్, పోసాని కృష్ణ మురళి మరియు తనికెళ్ల భరణి కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆచార్య సినిమాలో చిరంజీవి మధ్య వయస్కుడైన నక్సలైట్‌గా మారిన సామాజిక సంస్కర్త పాత్రలో నటించారు. ఈ సినిమాతో పాటు.. చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో భోలా శంకర్ , మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమాలో కూడా చిరంజీవి నటిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…