Rakul Preet Singh: ఫిలిం ఇండస్ట్రీలో లవ్ ఎఫైర్లు, బ్రెకప్ లు చాలా కామన్. ఇది బాలీవుడ్ లో చాలా ఎక్కువ. రోజుకో లవ్ స్టోరీ, బ్రేకప్ గురించి వార్తలు వస్తూనే ఉంటాయి. వీటిలో చాలా మంది ఓపెన్ అవుతుంటారు.. కొంత మంది తన రిలేషన గురించి గుట్టుగా ఉంచుతారు.
ఎప్పుడో పార్టీలో, ఏదో కార్యాక్రమానికి వెళ్లినప్పుడు.. ఫోటోలకు చిక్కుతుంటాయి ప్రేమ జంటలు. ఇప్పటికే మలైకా అరోరా- అర్జున్ కపూర్ రిలేషన్ షిప్ లో ఉన్నామని బహిరంగంగానే అంగీకరించారు. ఇటీవల పెళ్లితో ఒకటైన విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ తాము ఎప్పుడూ ప్రేమలో ఉన్నామని బహిరంగంగా ఎప్పుడూ అంగీకరించలేదు.
కియారా అద్వానీ కూడా సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో ఉన్నారని తెలుసు కానీ ఎప్పుడూ.. అంగీకరించలేదు.
ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం తన జాకీ భగ్నానీతో రిలేషన్ షిప్ గురించి ఎప్పుడూ దాచుకోలేదు. తాము ప్రేమలో ఉన్నట్లు భయం లేకుండా అంగీకరించింది.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది రకుల్. ఇంత పెద్ద సెలబ్రెటీ అయి ఉండీ.. మీరు మీ రిలేషన్ ను వెల్లడించారని అడగ్గా…రకుల్ నవ్వేసింది. ‘ఇందులో దాచిపెట్టడానికి ఏముందసలు! రహస్యంగా దాక్కుని పరుగులు పెట్టేవారు చాలామంది ఉన్నారంటూ వ్యాఖ్యలు చేసింది.
కానీ మేమిద్దరం ఆ టైప్ కాదని.. మాకసలు అలాంటి ఆలోచనలే లేవని రకులు చెప్పుకొచ్చింది. ప్రేమలో పడటం తప్పు కాదు. మేం ఒకర్నొకరం గౌరవించుకుంటాం. మా రిలేషన్‌నీ గౌరవిస్తాం. అందుకే ఓపెన్‌గా చెప్పేశా’ అని వెల్లడించింది. సీక్రెట్ గా రిలేషన్స్ మెయింటైన్ చేసే ఉద్దేశం తనకు లేదని నేరుగా చెప్పేసింది రకుల్. ప్రస్తుతం రకుల్ సినిమాలో బిజీగా ఉంది. చేతిలో అరడజన్ సినిమాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో బాలీవుడ్ లో చాలా బిజీ అయింది ఈ అమ్మడు. తెలుగులో ఇటీవల నటిాంచిన కొండపొలం సినిమా… నటిగా మంచి గుర్తింపు తీసుకువచ్చింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…