Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త..! ఆ కోరిక కూడా తీరినట్లే..!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త..! ఆ కోరిక కూడా తీరినట్లే..!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త రానే వచ్చింది. వైజాగ్ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయంపై రాజ్యసభ సభ్యులు, ఏపీ బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ఇవాళ మీడియాతో మాట్లాడారు.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త..! ఆ కోరిక కూడా తీరినట్లే..!
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త..! ఆ కోరిక కూడా తీరినట్లే..!

ప్రస్తుతం రైల్వే జోన్ తీసుకురావాలనే ప్రతి పాదన ఎప్పటి నుంచో ఉంది. కానీ.. అధికారిక ప్రకటన మాత్రం ఇంతవరకు రాలేదు. కానీ ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన ఈ జోనల్ తో ఆ కోరిక తీరనుంది. పూర్తి స్థాయిలో విశాఖ పట్నం ప్రత్యేక జోన్ ను ఏర్పాటు చేసేందుకు సంబంధించిన అన్ని పనులను త్వరలో ప్రారంభం కానున్నానయని కూడా ప్రకటన చేశారు.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త..! ఆ కోరిక కూడా తీరినట్లే..!

ఈ సందర్భంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ జోన్ కు సంబంధించి పూర్తి స్థాయి ప్రాజెక్ట్ రిపోర్టు సిద్ధమైందని చెప్పినట్లు జి.వి.ఎల్ నరసింహారావు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇదొక శుభవార్త అని తెలిపారు.

గడిచిన మూడు సంవత్సరాలను నుంచి..

ఈ విశాఖ రైల్వే జోన్ భవన నిర్మాణ కార్యాలయం కూడా అతి త్వరలోనే ప్రారంభం కానుందని.. పూర్తి స్థాయిలో రైల్వే జోన్ కార్యకలాపాలను అతి త్వరలోనే జరగనున్నట్లు పేర్కొన్నారు. ఇక రైల్వే బోర్టు అనేది వాస్తవానికి జోన్లు తగ్గించాలనే ఆలోచనలో ఉందని.. విశాఖ రైల్వే జోన్ రైల్వే‌స్‌కు నష్టం కలిగించే ప్రతిపాదన అయినప్పటికీ.. మోదీకి ఏపీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేయాలనే ఈ మంచి నిర్ణయం తీసుకున్నారననారు. డీపీఆర్ త్వరలోనే ఆమోదింపబడి పనులు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి చెప్పారన్నారు. కేంద్ర ప్రభుత్వం గడిచిన మూడు సంవత్సరాలను నుంచి పన్నులు రూపంలో ఏపీ నుంచి కలెక్ట్ చేసిన మొత్తం కంటే.. ఎక్కువ మొత్తాన్ని రాష్ట్రానికి ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు.