Holidays: విద్యాసంస్థలకు మూడు రోజులు సెలవులు ప్రకటించడం కర్ణాటక ప్రభుత్వం..! కారణం అదేనా?
Holidays: కర్ణాటకలో ‘ హిజాబ్’ వివాదం రోజురోజుకు పెరుగుతోంది. ఉడిపి జిల్లాలో ప్రారంభమైన ఈ వివాదం చిలికిచిలికి గాలి వానలా మారుతోంది. ఇప్పటికే ఉడిపి జిల్లాతో పాటు శివమొగ్గ, బెళగావి, కొప్పెల జిల్లాలకు పాకింది. ఓ వర్గం విద్యార్థినిలు హిజాబ్ ధరించి తరగతులకు హాజరవ్వడాన్ని మరో వర్గం విద్యార్థులు వ్యతిరేఖిస్తూ.. కాషాయ కండువాలతో హాజరు అవుతున్నారు.
అయితే కర్ణాటక ప్రభుత్వం మాత్రం స్కూళ్లు, కళాశాలలకు కేవలం యూనిఫాంతోనే హాజరుకావాలని స్పష్టం చేసింది. దీంతో విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయారు. దీంతో పాఠశాలలు, కళాశాలల వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతోంది.
రెండు వర్గాలు పోటాపోటీగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈవ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. హిజాబ్ ధరించి విద్యార్థులు తరగతులకు హాజరుకావడాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుండగా… బీజేపీ మాత్రం విద్యాలయాల్లో చదువుకునే వారంతా సమానభావంతో ఉండేదుకు యూనిఫాంతో హాజరుకావాలని కోరుతోంది.
ప్రస్తుతం ఈ అంశం జాతీయస్థాయిలో కూడా చర్చనీయాంశం అవుతోంది. ఇదిలా ఉంటే కర్ణాటక వ్యాప్తంగా ఉద్రిక్తతలు చెలరేగుతున్న క్రమంలో ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు స్కూళ్లు, కళాశాలలకు సెలవులు మంజూరు చేశారు. మరోవైపు ప్రస్తుతం హిజాబ్ అంశం కర్ణాటక హైకోర్ట్ ముందుంది. రేపు కూడా హైకోర్ట్ లో విచారణ జరుగనుంది. ఈ వివాదంపై రాజ్యాంగమే మాకు భవద్గీత అని.. రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాం అని వ్యాఖ్యానించింది. విద్యార్థులంతా సంయమనం పాటించాలని కోరింది. శాంతియుతంగా ఉండాలని సూచించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…