క్రికెట్ గురించి తెలిసిన ప్రతీ ఒక్కరికి ఐపీఎల్ గురించి తప్పకుండా తెలుస్తుంది. అందులో ఒక్కో టీంకు ఒకొక్కరు ప్రాచైంజీలా ఉంటారు. ఇలా కింగ్స్ ఎలెవర్ పంజాబ్ జట్టుకు సహ యజమానిగా నటి ప్రీతిజింటా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య యువరాజ్ సింగ్ తో ఈ అమ్మడు ఎంతో క్లోజ్ గా కనిపించారు. తర్వాత యువరాజ్ ఫామ్ సరిగ్గా లేకపోవడంతో అతడికి ఐపీఎల్ లో మరో ప్రాచైంజీ దక్కించుకుంది.
ఇలా అతడు చాలా టీంలు మారాడు. తర్వాత క్రికెట్ కు గుడ్ బై కూడా చెప్పేశాడు. ఇదిలా ఉంటే.. ప్రతీజింటా తాజాగా కవలలకు జన్మనిచ్చింది. సరోగసి విధానంలో కవల పిల్లలకు తల్లైనట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ గురువారం ఉదయం ఆమె తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ చేశారు. తాను ఒక ఆనందకరమైన విషయాన్ని పంచుకోవాలని అనుకుంటున్నా.. తాను తల్లిని అయ్యానని.. కవలలకు సరోగసి ద్వారా జన్మనిచ్చానని.. వాళ్ల పేర్లు జై, జియాలుగా చెప్పారు.
మా జీవితాల్లోకి ఇలా వాళ్లను మా జీవితాల్లోకి ఆహ్వానించడం మాకెంతో ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రయాణంలో మాకు ఎల్లప్పుడూ తోడుగా నిలిచిన వైద్యబృందానికి కృతజ్ఞతలు అని ప్రీతి పేర్కొన్నారు. దీంతో ఆమెకు నెట్టింట్లో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. స్నేహితులు, బంధువులు, క్రికెటర్లు, సినీ ప్రముఖులు ఇలా చాలామంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇక ప్రీతీజింటా విషయానికి వస్తే.. ఆమె దిల్ సే తో వెండితెరకు పరిచయం అయ్యారు. తెలుగులో ప్రేమంటే ఇదేరాలో వెంకటేష్ సరసన నటించారు. 2016లో ఆమె అమెరికాకు చెందిన జీన్ ను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె లాస్ ఏంజెల్స్ లో ఉంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…