స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇది.. ఒకప్పుడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ గా మారాడు. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుత్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప. ప్రస్తుతం దీనికి సంబంధించిన సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. ఐదు భాషల్లో తెరకెక్కిుతున్న ఈ సినిమా డిసెంబర్ 17 న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు.
అయితే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ఈ మూవీ.. మూడోది. ఆర్య, ఆర్య 2 మరియు పుష్ప. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీని మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్నాయి. రష్మిక మందన్న కథానాయిక.. వర్సటైల్ మలయాళీ యాక్టర్ ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నెగిటివ్ రోల్స్ చేస్తున్నారు.
ఇక దీనిలో స్టార్ హీరోయిన్ సమంత ఐటెం సాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా నుంచి మూడు పాటలను విడుదల చేశారు. వీటికి విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక రేపు మరో పాటు ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ అనే సాంగ్ ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు ఇప్పటికే భారగీ ప్రమోషన్స్ ను మొదలు పెట్టేశారు.
ఇదంతా ఇలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ అండ్ శాటిలైట్ రైట్స్ భారీ రేటుకు సేల్ అయిపోయింది. తమిళనాడు థియేట్రికల్ రైట్స్ పాపులర్ ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్ రూ. 6.5 కోట్లకు దక్కించుకుంది. అలాగే మలయాళం శాటిలైట్ రైట్స్ ఏషియా నెట్ ఫ్యాన్సీ ధరకు దక్కించుకుంది. ఇక హిందీ హిందీ డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్లలో విడుదల చేయడానికి అంగీకరించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…