కేంద్రం ఈపీఎఫ్ ఉద్యోగులకు శుభవార్త చెప్పే దిశగా అడుగులు వేస్తోంది. కనీస పెన్షన్ పెంచాలనే ప్రతిపాదన కార్మిక శాఖ నుంచి వెలువడింది. కనీస పెన్షన్ పెంచాలనే ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి పెన్షన్ పెంపు గురించి ప్రకటన వెలువడవచ్చని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పెన్షన్ పెంపు ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది.
విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం పెన్షన్ ను రెట్టింపు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం పీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు కనీస పెన్షన్ 1000 రూపాయలుగా ఉండగా 2,000 రూపాయలకు పెన్షన్ ను పెంచే అవకాశాలు ఉన్నాయని.. అయితే కేంద్రం ఈ నిబంధనను అమలులోకి తీసుకొస్తే కేంద్రంపై 2,000 కోట్ల రూపాయల నుంచి 2,500 కోట్ల రూపాయల వరకు ఆర్థికంగా భారం పడనుందని తెలుస్తోంది.
అయితే కేంద్రం నుంచి అధికారికంగా ప్రకటన వెలువడక ముందే కొంతమంది పీఎఫ్ సబ్ స్క్రైబర్లు మాత్రం 3,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తానికి కనీస పెన్షన్ ను పెంచాలని కోరుతున్నారు. దేశంలో 60 లక్షల కంటే ఎక్కువమంది ప్రస్తుతం పెన్షన్ ను పొందుతున్నారు. ఉద్యోగి 58 సంవత్సరాలు పూర్తైన తరువాత పెన్షన్ ను తీసుకోవడానికి అర్హులవుతారు.
ప్రతి నెలా ఉద్యోగుల వేతనంలో 12 శాతం పీఎఫ్ ఖాతాలో జమవుతుంది. ఈపీఎఫ్ ఖాతాలో కంపెనీ కూడా ఇంతే మొత్తాన్ని క్రెడిట్ చేస్తుంది. ఉద్యోగి కంట్రిబ్యూషన్ లో 8.33 శాతం ఈపీఎస్ అకౌంట్ లో జమవుతుంది. మరి కేంద్రం పెన్షన్ పెంపు విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…