తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రి పేరు మార్మోగిపోతోంది. సిరివెన్నెల మరణంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయింది. కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్న సిరివెన్నెల తాజాగా తుది శ్వాస విడిచారు. సినిమా ప్రేమికులు అందరూ కూడా సాహిత్య లోకానికి చీకటి రోజుగా అభివర్ణిస్తున్నారు. గత కొద్దిరోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల మరోసారి అస్వస్థతకు గురయ్యారు.
గత నెల 24న సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్న కిమ్స్ వైద్యులు ఎప్పటికప్పుడు సిరివెన్నెల ఆరోగ్యాన్ని పరీశిలిస్తూ వచ్చారు.ఇక సిరివెన్నెల ఆరోగ్యం మరింత క్షీణించడంతో నవంబర్ 31న తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విన్న వెంటనే మెగాస్టార్ చిరంజీవి, తమన్, త్రివిక్రమ్, ప్రకాష్ రాజ్, ఉత్తేజ్ ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణం తెలుగు సిని సాహిత్యానికి తీరని లోటని చెప్పవచ్చు.అయితే చిన్న అనారోగ్య సమస్యతో ఆసుపత్రికి వెళ్లిన ఆయన తిరిగి వస్తారని అందరు భావించారు. కాని ఇలా ఎవరు ఊహించని విధంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.ఈయన గొంతు శాశ్వతంగా మూగబోవడంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.
సిరివెన్నెల లేరన్న వార్తను ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. గూగుల్ కూడా సిరివెన్నెలకు నివాళి ఘటించింది.సిరివెన్నెలతో మొదలయిన జీవన గీతం, సీతారామ శాస్త్రి గారి సాహిత్యంతో నిలిచిపోతుంది చిరకాలం” అని గూగుల్ ఇండియా ట్వీట్ చేసింది. Ok Google, play Sirivennela songs అంటూ ప్రస్తుత ట్రెండింగ్ సెర్చ్‌ను ట్వీట్‌కు జోడించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…