Movie News

సిరివెన్నెలను కడసారి చూడటం కోసం వచ్చిన తారలు వీళ్లే..!

సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణవార్తతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా మూగబోయింది. ఆయన మరణ వార్తతో పలువురు ప్రముఖులతో పాటు, కుటుంబ సభ్యులు కూడా బోరున విలపిస్తున్నారు. సిరివెన్నెల మరణం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక తీరని లోటు అని చెప్పవచ్చు. అయితే అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సిరివెన్నెల మళ్లీ మామూలు మనిషిగా తిరిగి వస్తారు అని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా అతను అనంత లోకాలకు వెళ్లిపోయారు.

ఆయన మరణవార్త విన్న పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయనను కడసారిగా చూసుకునేందుకు భారీగా ప్రముఖులు ఫిలిం ఛాంబర్ కు తరలిస్తున్నారు. సీతారామశాస్త్రి భౌతికకాయన్ని బుధవారం అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్‌కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో సినీ ప్రముఖులు ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకుని ఆయన పార్థివదేహానికి కన్నీటి నివాళులు అర్పించారు.

టాలీవుడ్ స్టార్ హీరోస్ అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీయార్, జగపతిబాబు, నాగబాబు, శ్రీకాంత్, రాజశేఖర్‌, అల్లు అర్జున్, నాని, రానా దగ్గుబాటి, శర్వానంద్ ఇంకా పలువురు ప్రముఖులు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఇక రాజమౌళి, కీరవాణి, మణిశర్మ, గుణశేఖర్, క్రిష్ జాగర్లమూడి, మారుతి, పరుచూరి గోపాలకృష్ణ, ఆచంట గోపీనాథ్, ఎస్వీ కృష్ణారెడ్డి, కే అచ్చిరెడ్డి, తనికెళ్ల భరణి, రావు రమేష్ ఆయనను కడసారిగా చూసేందుకు తరలి వచ్చారు.

అలాగే నిర్మాతలు అల్లు అరవింద్, ప్రసాద్, కేఎల్ నారాయణ, చోటా కే నాయుడు, సింగర్ సునీత తదితరులు సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు సిరివెన్నెల తో తమకున్న జ్ఞాపకాలను, అనుబంధాలను గుర్తు చేసుకుని మరీ ఎమోషనల్ అవుతున్నారు.సిరివెన్నెల సీతారామశాస్త్రి అంతిమ యాత్ర బుధవారం మధ్యాహ్నం నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

వంటింట్లోనే హెల్త్ సీక్రెట్… మెంతులు ఎందుకు తినాలి?

మన వంటింట్లో సాధారణంగా కనిపించే మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహార పదార్థంగా గుర్తింపు పొందుతున్నాయి. పరిమాణంలో చిన్నగా…

4 minutes ago

రాత్రి నిద్రలో ఈ అలవాటు ఉంటే జాగ్రత్త… దంతక్షయం పెరుగుతుంది!

నిద్రలో నోరు తెరిచి శ్వాస తీసుకోవడం చాలా మందిలో కనిపించే సాధారణ అలవాటు. అయితే ఇది చిన్న విషయం అనిపించినా,…

13 minutes ago

దేవుడు ఎక్కడైనా ఉన్నాడంటే… గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద చెప్పిన అసలు సత్యం!

దేవుడు ప్రతిచోటా ఉన్నాడనే భావన అనేక ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ప్రధానంగా వినిపిస్తుంది. అయితే అదే సమయంలో మనుషులు ఆలయాలు, మసీదులు,…

21 minutes ago

వేదమంత్రాల నడుమ అద్భుత వేడుక… పాల్ఘర్‌లో మందిర ప్రతిష్ఠ!

మహారాష్ట్ర తీరప్రాంతంలో ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది. పాల్ఘర్‌ జిల్లా పరిధిలోని దుర్వేస్ గ్రామం ఇటీవల భక్తి వాతావరణంతో కళకళలాడింది. బిఎపిఎస్…

51 minutes ago

హాలిడే హార్ట్ సిండ్రోమ్’ అంటే ఏమిటి? వేసవిలో పెరుగుతున్న ముప్పు!

వేసవి కాలం వచ్చేసరికి శరీరంపై పడే ఒత్తిడి గణనీయంగా పెరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతలు, తేమ కలిసిన పరిస్థితుల్లో గుండె ఆరోగ్యంపై…

59 minutes ago

ఎండ కాదు అసలు విలన్… తేమతో వచ్చే ‘హిడెన్ హీట్’ అలర్ట్!

దేశవ్యాప్తంగా ఈ ఏడాది వేసవి తీవ్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు తూర్పు, మధ్య, ద్వీపకల్ప ప్రాంతాల్లో…

1 hour ago