General News

గూగుల్ నుంచి రెండు స్మార్ట్ ఫోన్లు ప్రకటన.. వాటి ఫీచర్స్ ఇవే.. !

ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. వినియోగదారుల ఆసక్తికి అనుగుణంగా ఫోన్లను లాంచ్ చేస్తున్నారు. ఒకరికంటే ఒకరు పోటాపోటీగా అత్యాధునిక ఫీచర్స్‌తో విడుదల చేస్తున్నాయి. దీనిలో భాగంగానే గూగుల్ టెన్సార్ ప్రాసెసర్‌తో గూగుల్ పిక్సెల్ 6, గూగుల్ పిక్సెల్ 6 ప్రో స్మార్ట్ ఫోన్లను గూగుల్ అధికారికంగా ప్రకటించింది. వీటికి సంబంధించి స్పెసిఫికేషన్లు విడుదల చేసింది.

మేడ్ బై గూగుల్ అనే ట్వీటర్ ఖాతా ద్వారా వీటిని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇవి మూడు కలర్ కాంబినేషన్లలో లాంచ్ కానున్నాయి. దీనిలో గూగుల్ పిక్సెల్ 6 ప్రో లో కెమెరా అనేది వైడ్ యాంగిల్ లో ఉండనుంది. దీంతో పాటుఅల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, టెలిఫొటో షూటర్ కూడా ఉండనున్నాయి. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది.

దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇక గూగుల్ పిక్సెల్ 6 ప్రోలో .. డిస్‌ప్లే మరియు 6.7 అంగుళాల క్యూ హెచ్ డీ ను అందించనున్నారు. ఈ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉండనుంది. గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ ఫోన్లను కంపెనీ ప్రముఖ యూట్యూబర్లకు అందించింది. దీనికి సంబంధించిన కెమెరా షాట్లను ఈ యూట్యూబర్లను ఐఫోన్ 12 ప్రో, పిక్సెల్ 5 షాట్లతో పోల్చారు.

గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ ఫోన్లతో తీసిన కెమెరాలు కూడా చాలా బాగా వచ్చాయి. ఈ స్మార్ట్ ఫోన్లు ఈ సంవత్సరమే లాంచ్ కానున్నట్లు తెలిపారు. రెండు నెలల క్రితం లీకైన ఫొటోల తరహాలోనే దీని డిజైన్ ఉంది. ఫోన్ పైన మధ్యభాగంలో పంచ్ హోల్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఇందులో అందించనున్న టెన్సార్ ప్రాసెసర్లను గూగుల్ స్వయంగా రూపొందిస్తుంది. ఇవి మొదట పిక్సెల్ 6 సిరీస్ ఫోన్లతోనే ఎంట్రీ ఇవ్వనున్నాయి. దీంతో యాపిల్ తరహాలో గూగుల్ కూడా తన ప్రాసెసర్లను తనే రూపొందించుకుంటుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఎండలో అలసటకు ఒక్క గ్లాస్ చాలు.. చెరుకు రసం లేదా కొబ్బరి నీళ్లు?

వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీరసం తగ్గించుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరంగా మారింది. ఈ…

9 minutes ago

బ్రహ్మ ముహూర్తం అలవాటు పెంచుకుంటే మీలో ఈ మార్పులు ఖాయం!

మన జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద మార్పులకు దారి తీస్తాయి. అలాంటి వాటిలో ఉదయం వేళ లేవడం ఒక…

14 minutes ago

ఫేస్ ఇన్‌ఫ్లమేషన్ అలర్ట్: అందం తగ్గించే ముఖ వాపు… సులభంగా తగ్గించే చిట్కాలు ఇవే!

ముఖం ఎప్పుడూ ఫ్రెష్‌గా, కాంతివంతంగా కనిపించడం ప్రతి ఒక్కరికీ ఇష్టం. అయితే కొన్నిసార్లు కారణం తెలియకుండానే ముఖం ఉబ్బినట్లు, ఎర్రబడినట్లు…

19 minutes ago

భారత్ చింతపండు దుమ్మురేపుతోంది… ప్రపంచ మార్కెట్‌లో టాప్ ప్లేస్!

భారతీయ వంటింట్లో చింతపండు లేకుండా చాలా వంటలు పూర్తవవు. పులుపు రుచిని ఇచ్చే ఈ సహజ పదార్థం కేవలం రుచికే…

25 minutes ago

చేతిలో ఉన్న ₹50 నోటు… వెనుక ఇంత గొప్ప చరిత్ర ఉందని మీకు తెలుసా?

భారతీయ కరెన్సీ నోట్లపై కనిపించే చిత్రాలు కేవలం అలంకరణ కోసం మాత్రమే కాకుండా, దేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా…

31 minutes ago

రసగుల్లాలు తిన్న వెంటనే పక్షవాతం… ఈ అరుదైన వ్యాధి గురించి తెలుసుకోండి!

హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఒక అరుదైన వైద్య ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేవలం కొన్ని రసగుల్లాలు తిన్న తర్వాత 35…

36 minutes ago