ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. వినియోగదారుల ఆసక్తికి అనుగుణంగా ఫోన్లను లాంచ్ చేస్తున్నారు. ఒకరికంటే ఒకరు పోటాపోటీగా అత్యాధునిక ఫీచర్స్‌తో విడుదల చేస్తున్నాయి. దీనిలో భాగంగానే గూగుల్ టెన్సార్ ప్రాసెసర్‌తో గూగుల్ పిక్సెల్ 6, గూగుల్ పిక్సెల్ 6 ప్రో స్మార్ట్ ఫోన్లను గూగుల్ అధికారికంగా ప్రకటించింది. వీటికి సంబంధించి స్పెసిఫికేషన్లు విడుదల చేసింది.

మేడ్ బై గూగుల్ అనే ట్వీటర్ ఖాతా ద్వారా వీటిని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇవి మూడు కలర్ కాంబినేషన్లలో లాంచ్ కానున్నాయి. దీనిలో గూగుల్ పిక్సెల్ 6 ప్రో లో కెమెరా అనేది వైడ్ యాంగిల్ లో ఉండనుంది. దీంతో పాటుఅల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, టెలిఫొటో షూటర్ కూడా ఉండనున్నాయి. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది.
దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇక గూగుల్ పిక్సెల్ 6 ప్రోలో .. డిస్‌ప్లే మరియు 6.7 అంగుళాల క్యూ హెచ్ డీ ను అందించనున్నారు. ఈ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉండనుంది. గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ ఫోన్లను కంపెనీ ప్రముఖ యూట్యూబర్లకు అందించింది. దీనికి సంబంధించిన కెమెరా షాట్లను ఈ యూట్యూబర్లను ఐఫోన్ 12 ప్రో, పిక్సెల్ 5 షాట్లతో పోల్చారు.
గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ ఫోన్లతో తీసిన కెమెరాలు కూడా చాలా బాగా వచ్చాయి. ఈ స్మార్ట్ ఫోన్లు ఈ సంవత్సరమే లాంచ్ కానున్నట్లు తెలిపారు. రెండు నెలల క్రితం లీకైన ఫొటోల తరహాలోనే దీని డిజైన్ ఉంది. ఫోన్ పైన మధ్యభాగంలో పంచ్ హోల్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఇందులో అందించనున్న టెన్సార్ ప్రాసెసర్లను గూగుల్ స్వయంగా రూపొందిస్తుంది. ఇవి మొదట పిక్సెల్ 6 సిరీస్ ఫోన్లతోనే ఎంట్రీ ఇవ్వనున్నాయి. దీంతో యాపిల్ తరహాలో గూగుల్ కూడా తన ప్రాసెసర్లను తనే రూపొందించుకుంటుంది.

































