బుల్లితెరపై యాంకర్ ప్రదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే బుల్లితెరపై వివిధ కార్యక్రమాలకు యాంకర్గా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. అదే విధంగా పలు సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్న ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు.
కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ప్రదీప్ కి ఎక్కడికి వెళ్లిన తన పెళ్లి ప్రస్తావన వస్తుంది. ఈ క్రమంలోనే స్టేజ్ పైనే ప్రదీప్ ను ముత్తాత అంటూ ఆ కంటెస్టెంట్ దారుణంగా అవమానపరిచాడు. అయితే ఇదంతా కూడా ఓ కార్యక్రమంలో భాగంగా మాత్రమే. ప్రస్తుతం ప్రదీప్ యాంకర్ గా జీ టీవీలో ప్రసారమవుతున్న డ్రామా జూనియర్స్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.
ఈ ప్రోమోలో భాగంగా కంటెస్టెంట్ విజ్వల్ బాలయ్య బాబు వేషధారణలో వచ్చి అందరినీ ఎంతో సందడి చేశారు. ఈ క్రమంలోనే స్కిట్ లో భాగంగా బాలయ్య బాబు ఉదయమే నిద్ర లేస్తూ మంచం నుంచి కిందకి దిగి భూమాతకు వందనం అంటూ భూదేవికి నమస్కరిస్తాడు. అదేవిధంగా జడ్జిగా వ్యవహరిస్తున్న అటువంటి సింగర్ సునీతను చూపించి గోమాతకు వందనం అంటాడు. ఇక యాంకర్ ప్రదీప్ ను చూపిస్తూ ముత్తాతకు వందనం అనగా… స్టేజ్ పై ఉన్న వారందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు.
ఈ స్కిట్ లో భాగంగా బాలయ్య వేషధారణలో ఉన్న విజ్వల్ దగ్గరకు ఒక అమ్మాయి ఏడుస్తూ మీరు నాకు సహాయం చేయగలరు.. నా కూతురు క్యాన్సర్ తో బాధపడుతుంది అని ఏడవగా నువ్వేం బాధపడకు అమ్మా నీకు నేనున్నాను.. అయినవాళ్లకు కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో కానీ.. ఆడపిల్లకు కష్టం వస్తే అరక్షణం కూడా ఆలస్యం కాదు. నీ కూతురికి ఏం కాదంటూ ఆమెకు భరోసా ఇస్తాడు.
ఈ విధంగా బాలయ్య బాబు నిజజీవితంలో కూడా ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్లకు బసవతారకం ఆస్పత్రిలో ఉచితంగా చికిత్స చేయించి సహాయం చేశారు. ఈ సందర్భంగా బాలయ్య బాబు చేసిన సహాయాన్ని ఈ సందర్భంగా అందరూ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…