Categories: FeaturedMovie News

Goparaju Ramana : కోటా గారి రేంజ్లో గుర్తింపు రావాల్సింది.. కానీ ఎందుకు రాలేదంటే.. పరుచూరి బ్రదర్స్ 1 కేజీ వెండి ఇచ్చారు : గోపరాజు రమణ

Goparaju Ramana : నాటకాలతో మొదలైన కెరీర్ సీరియల్స్, అలాగే నాటికలు, చివరికి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న గోపరాజు రమణ గారు తెనాలికి చెందినవారు. ఆయన తన పదిహేనవ యేట నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు. అక్కినేని గారి చేతుల మీదుగా అవార్డు కూడా అందుకున్నారు. ఇక ఆపై ఎన్నో నాటకాల్లో నటించిన ఆయన పరుచూరి బ్రదర్స్ దగ్గర నుండి ఎన్నో బహుమతులను గెలుచుకున్నారు. అప్పట్లో పరుచూరి బ్రదర్స్ బహుమానంగా వెండి పళ్లెం, గిన్నెలు ఇచ్చేవారు అలా కేజీ వెండి ఇప్పటికీ భద్రంగా ఉంది అంటూ చెప్పారు.

ఆ సినిమా హిట్ అయ్యుంటే కోటా గారి రేంజ్లో ఉండేవాడిని…

గోపరాజు గారు ఈటీవీలో చాలా సీరియల్స్ లో నటించారు. ఇక ఈటీవీ ఇప్పటివరకూ తన కుటుంబాన్ని ఆదుకుందని, ఇప్పుడు కూడా ఈటీవీలో ఉద్యోగం మానేయొద్దు అనే చెప్తారని వెల్లడించారు. ఇక సినిమాల్లో ‘గ్రహణం’ సినిమా ద్వారా పరిచయమైన రమణ మూర్తి గారు సాగర్ గారి దర్శకత్వంలోని ‘దేవి అభయం’ సినిమాలో విలన్ పాత్రలో నటించారు. వైవిధ్యమైన విలనిజం చూపిన ఆ సినిమా హిట్ అయ్యుంటే కోటా గారి కెరీర్ లా తన కెరీర్ ఉండేదని అభిప్రాయపడ్డారు.

ఇక ఎపుడూ డైరెక్టర్లను, రచయితలను వెళ్లి అవకాశాలు అడగలేదని అందుకే చాలా సినిమాల్లో అవకాశలు కోల్పోయానని చెప్పారు. మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా ద్వారా చాలా ఆలస్యంగా నాకు గుర్తింపు వచ్చిందని చెప్పారు. ఇక గోపరాజు గారి తనయుడు విజయ్ కూడా నటుడు అలాగే దర్శకుడు. ఇక గోపరాజు గారు ఈ మధ్య కాలంలో f3, ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి సినిమాల్లో నటించారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago