Gopi Chand: యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన తాజా చిత్రం రామబాణం. డింపుల్ హయతి, గోపీచంద్ నటించిన శ్రీవాస్ దర్శకత్వం వహించాడు. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా యూనిట్ ఇంటర్వ్యూలలో, టీవీ షోలో పాల్గొంటూ సందడి చేస్తోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో గోపీచంద్, హీరోయిన్ డింపుల్ హయతి, దర్శకుడు శ్రీవాస్ సుమ హోస్ట్ వ్యవహరిస్తున్న సుమా అడ్డ అనే షోలో సందడి చేశారు.
ఏప్రిల్ 29వ తేదీ ప్రసారం కానున్న ఈ షో కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల అయింది.
ఇక ఈ షో లో సుమ ఎప్పటిలాగే తన కామెడీ టైమింగ్ తో, పంచులు , సెటైర్లతో సందడి చేసింది. ఇక ఈ షో గోపీచంద్ సుమపై రివర్స్ లో సెటైర్లు వేస్తూ ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో జయం సినిమా స్కూఫ్ చేస్తూ..సుమ హీరోయిన్ గా చేయగా.. మీరు హీరోయిన్ అయితే ఆ సినిమాలో నేను విలన్ గానే చేస్తా అంటూ గోపీచంద్ సుమని ఆటపట్టిస్తూ నవ్వించారు.
అంతే కాకుండా వెళ్లవయ్య వెళ్ళు అని సుమ డైలాగ్ చెప్పగానే ఇంత దగ్గర నుండి చూశాక వెళ్లకుండా ఉంటానా అంటూ గోపీచంద్ అక్కడినుండి పారిపోయాడు. ఆ తర్వాత ఒక గేమ్ లో భాగంగా భర్త ఇంటికి ఆలస్యంగా వస్తే భార్య అలుగుతుంది అని సుమ అనగానే.. షోలన్నీ పూర్తి చేసుకుని మీరే రోజు ఇంటికి లేటుగా వెళతారు అంటూ మరోసారి సుమపై సెటైర్ వేశారు.
ఇలా ప్రోమో చివరిలో గోపిచంద్ సడెన్ గా సుమ గొంతు పట్టుకున్నాడు. దీంతో సుమతో పాటు అక్కడున్న వారందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే గోపీచంద్ సుమ గొంతు ఎందుకు పట్టుకున్నాడో తెలియాలంటే మొత్తం ఎపిసోడ్ చూడాల్సిందే. అయితే ఇది కూడా ప్రోమోలో భాగమేనని పలువురు ఈ ప్రోమో పై కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…